Nominated Posts: ఏపీలో 20 నామినేటెడ్ పదవులతో తొలి జాబితా విడుదల- జనసేన, బీజేపీకి వచ్చిన పదవులేంటంటే?

Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల జాతర మొదలైంది. వివిధ విభాగలకు సంబంధించి నియామక జాబితాను ప్రభుత్వం కాసేపటి క్రితం విడుదల చేసింది.

Continues below advertisement

Andhra Pradesh: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన వారందరికీ ఈ పదవులు దక్కాయి. ఈ నామినేటెడ్ పదవుల కోసం ఎప్పటి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన లీడర్లు ఎదురు చూస్తున్నారు. వీటి భర్తీలో కూడా కూటమి నేతలపై ఎంతో ఒత్తిడి ఉంది. కీలకమైన పోస్టుల భర్తీలో పీఠముడి వీడకపోవడంతో ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. పలు దఫాలుగా సమావేశమైన కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతొ సమస్యల్లేని 20 పోస్టులకు ఛైర్మన్‌లను నియమించారు. వాటిని ఇవాళ(సెప్టెంబర్‌ 24న ) విడుదల చేశారు. 

Continues below advertisement

 తొలి జాబితాలో విడుదల చేసిన 20 నామినేటెడ్‌ పదవులు, ఛైర్మన్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టు పేరు  ఎంపికైన నేత  పార్టీ  
ఏపీ టూరిజం ఛైర్మన్‌ నూకసాని బాలాజీ టీడీపీ
ఆర్టీసీ ఛైర్మన్‌గా  కొనకళ్ల నారాయణ టీడీపీ
20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ లంకా దినకర్‌ బీజేపీ 
హౌసింగ్ బోర్డు చైర్మన్‌  బత్తుల తాత్యబాబు టీడీపీ
మార్క్‌ఫెడ్ చైర్మన్  కర్రోతు బంగార్రాజు టీడీపీ
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌ మంతెన రామరాజు టీడీపీ
వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌  అబ్దుల్‌ అజీజ్‌ టీడీపీ
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP)  అనిమిని రవి నాయుడు టీడీపీ
AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR)        బోరగం శ్రీనివాసులు  టీడీపీ
ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్   దామచర్ల సత్య  టీడీపీ
సీడాప్‌ ఛైర్మన్‌( APలో ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ) దీపక్ రెడ్డి  టీడీపీ
ఏపీ స్టేట్ సీడ్స్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  ఛైర్మన్ మన్నె సుబ్బారెడ్డి  టీడీపీ
ఏపీ పద్మశాలి వెల్ఫేర్‌ అండ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌  నందమ్‌ అబద్దయ్య టీడీపీ
ఏపీ ఎస్‌ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్         పీఎస్ మునిరత్నం  టీడీపీ
ఏపీ అర్బన్ ఫైనాన్స్‌ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్  ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ
లెదర్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  ఛైర్మన్  పిల్లి మాణిక్యాల రావు  టీడీపీ
ఏపీ స్టేట్ వినియోగదారుల రక్షణ మండలి ఛైర్‌పర్శన్ పీతల సుజాత  టీడీపీ
A.P. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఎంఈ డీసీ)     తమ్మిరెడ్డి శివశంకర్‌  జనసేన 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్        తోట మెహర్‌ సీతారామ సుధీర్‌  జనసేన 
ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్    వజ్జ బాబురావు  టీడీపీ
ఏపీ టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్(ఏపీటిడ్కో) ఛైర్మన్‌        వేములపాటి అజయ్ కుమార్  జనసేన 

Also Read: టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఎదురొచ్చిన పదవులు - టీటీడీ బోర్డు పదవులవైపే అందరి చూపు!

Also Read: తిరుమల లడ్డూ వివాదం... పవన్‌కు క్షమాపణలు చెప్పిన కార్తీ - అపార్థం చేసుకోవద్దంటూ ట్వీట్

 

Continues below advertisement