Andhra Pradesh : టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఎదురొచ్చిన పదవులు - టీటీడీ బోర్డు పదవులవైపే అందరి చూపు!

TDP : పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు దక్కని వారికి నామినేటెడ్ పదవులు కేటాయించారు. జనసేన , బీజేపీ నేతలకూ అవకాశం ఇచ్చారు.

Continues below advertisement

Alliances Leaders who did not get tickets were allotted nominated posts : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఇరవై కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేశారు, ఇందులో అత్యధిక మంది టిక్కెట్లు త్యాగం చేయడమే కాదు పార్టీ కోసం కష్టపడి పని చేశారు. వారందరికీ చంద్రాబబు గుర్తింపు ఇచ్చారు. నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ 2019లో అదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీకి హ్యాండివడంతో చివరి క్షణంలో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఎన్నికల్లో కోటంరెడ్డి పార్టీలోకి రావడంతో ఆయనకే టిక్కెట్ కేటాయించారు. అనారోగ్యంతో ఉన్న అజీజ్ .. పార్టీ కోసం పని చేశారు. అందుకే ఆయన పనితీరుకు గుర్తింపుగా మొదటి పదవిని ఆయనకే ప్రకటించారు. 

Continues below advertisement

టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు

ఇక కర్రోతు బంగార్రాజుకు ఖరారైన టిక్కెట్ బీజేపీకి వెళ్లింది. ఆయనకూ కీలకమైన ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్  పదవి ఇచ్చారు.  రఘురామ కృష్ణరాజు కోసం సీటు త్యాగం చేసిన ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కేబినెట్ హోదా ఉండే అత్యంత కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కేటాయించారు. చీరాలలో టిక్కెట్ త్యాగం చేసిన నూకసాని బాలాజీ, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, అనకాపల్లి టిక్కెట్ త్యాగం చేసిన పీలా గోవింద్ సత్యనారాయణ, పీతల సుజాత, వజ్జ బాబూరావు వంటి సీనియర్ నేతలకు కీలక పదవులు కేటాయించారు. 

ఏపీలో 20 నామినేటెడ్ పదవులతో తొలి జాబితా విడుదల- జనసేన, బీజేపీకి వచ్చిన పదవులేంటంటే?

బీజేపీలో సీనియర్లకు మరోసారి నిరాశ

ఇక పొత్తుల్లో భాగంగా బీజేపీ నేత లంకా దినకర్ కు ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. గతంలో సోము వీర్రాజు  ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు లంకా దినకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అమరావతికి అనుకూలంగా మాట్లాడుతున్నారని.. పార్టీ ఏ విధానం ప్రకటించకపోయినా మాట్లాడుతున్నారని చర్యలు తీసుకున్నారు. తర్వాత సస్పెన్షన్ ఎత్తివేశారు. 2019కి ముందు లంకా దినకర్ టీడీపీలో ఉండేవారు. అప్పుడు టీడీపీ ఓడిపోవడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చాలా మంది సీనియర్లు  పదవుల కోసం చూస్తున్నారు. మొదటి జాబితాలో లంకా దినకర్ కు మాత్రమే చాన్స్ దక్కింది. జనసేన పార్టీ తరపున మూడు కీలక కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు ఇచ్చారు. తోట మెహర్ సీతారామ సుధీర్, తమ్మిరెడ్డి శివశంకర్, వేములపాటి అజయ్ కుమార్‌లకు ఈ పదవులు దక్కాయి. 

సనాతన ధర్మానికి అవమానం జరుగుతుంటే హిందువులకు బాధ్యత లేదా? పవన్ కల్యాణ్ సంచనల వ్యాఖ్యలు

త్వరలో టీటీడీ చైర్మన్ పోస్టు భర్తీ 

పదవుల భర్తీకి నారా లోకేష్ ప్రత్యేకమైన కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీ, జనసేనతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపి పదవుల జాబితా రెడీ చేస్తున్నారు. టీటీడీ బోర్జు పదవుల కోసం కసరత్తు కూడా దాదాపుగా పూర్తి చేశారు. ప్రస్తుత లడ్డూ వివాదం కారణంగా.. కొన్ని మార్పు చేర్లుపు చేసి.. అధ్యాత్మికత ఇమేజ్ ఉన్న వ్యక్తులతో బోర్డును ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  

 

Continues below advertisement
Sponsored Links by Taboola