RGV About Casting Couch Control : సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల వ్యవహారాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రీసెంట్ గా మలయాళీ సినీ పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు సంచలనం సృష్టించింది. చాలా మంది బాధితులు బయటకు వచ్చి తమకు ఎదురైన వేధింపుల గురించి చెప్పారు. ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణి అయ్యే చాలా మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. లేడీ కొరియోగ్రాఫర్ ఆయన మీద అత్యాచార ఆరోపణలు చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆగాలంటే ఏం చేయాలనే చర్చ జరుగుతోంది.
రామ్ గోపాల్ వర్మ కీలక సూచనలు
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు తగ్గాలంటే రెండు కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. “ఇండస్ట్రీలోకి రావాలనుకునే మహిళలు ఆయా డిపార్ట్ మెంట్ కు సంబంధించిన కమిటీలో మెంబర్ షిప్ తీసుకోవాలి. కొత్తవారికి ముందుగా అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? ఏ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది? ఏవైనా వేధింపులు ఎదురైతే కమిటీకి ఎలా చెప్పాలి? అనే విషయాలపై వారికి అవగాహన కల్పించాలి. అప్పుడే వారికి ఇండస్ట్రీ అంటే కొంత అవగాహన వస్తుంది.
మెంబర్ షిప్ లేని వారిని సినిమాల్లోకి తీసుకోకూడదు అనే కండీషన్ పెట్టాలి. మెంబర్ షిప్ ఉందంటే.. ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే విషయం కమిటీకి తెలుస్తుందనే భయం ఉండాలి. అప్పుడు అమ్మాయిలను మాయ చేయాలనుకునేవారు కంట్రోల్ అవుతారు. అందుకే, అప్ కమింగ్ యాక్టర్లకు అవగాహన కార్యక్రమాలు అనేవి చాలా ముఖ్యం. మెంబర్ షిప్ ఉంటే సదరు అమ్మాయిలను ఎక్స్ ప్లాయిడ్ చేయకూడదని ప్రొడ్యూసర్లకు అర్థం అవుతుంది. అమ్మాయిలకు మెంబర్ షిప్, వారికి అవగాహన కల్పించడం ద్వారానే ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను అడ్డుకునే అవకాశం ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.
‘శారీ’ నిర్మాణ పనుల్లో వర్మ బిజీ
ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. గిర కృష్ణ కమల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆరాధ్య దేవి, సత్య యదు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు నుంచి విడుదలైన టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ లో ఆరాధ్య గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కుర్రకారును కవ్వించింది. ఈ హాట్ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ పాటన్ ఆర్జీవీ డెన్ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేశారు. ఇకపై తన సినిమా పాటలను ఈ ఛానెల్ ద్వారానే విడుదల చేయున్నారు.
Read Also: లేడీ కొరియోగ్రాఫర్‌కు అల్లు అర్జున్ సాయం... అసలు విషయం చెప్పేసిన ‘పుష్ప 2’ నిర్మాత