Producer Ravi Shankar: లేడీ కొరియోగ్రాఫర్‌కు అల్లు అర్జున్ సాయం... అసలు విషయం చెప్పేసిన ‘పుష్ప 2’ నిర్మాత

Jani Master Case Updates: జానీ మాస్టర్ వ్యవహారంపై ‘పుష్ప 2’ నిర్మాత రవి శంకర్ యలమంచిలి తొలిసారి రియాక్ట్ అయ్యారు. బన్నీ గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

Continues below advertisement

Producer Ravi Shankar About Jani Master Issue: తెలుగు సినిమా పరిశ్రమలో దుమారం రేపుతున్న జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవి శంకర్ యలమంచిలి స్పందించారు. జానీ మాస్టర్, లేడీ కొరియోగ్రాఫర్ వ్యవహారం పర్సనల్ గొడవలా కనిపిస్తుందన్నారు. బాధిత యువతికి హీరో బన్నీ అండగా నిలిచారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. “జానీ మాస్టర్, లేడీ కొరియోగ్రాఫర్ వ్యవహారం చూస్తే పర్సనల్ ఇష్యూలా కనిపిస్తోంది. లేడీ కొరియోగ్రాఫర్ చాలా కాలంగా మా సినిమాలకు పని చేస్తోంది. ‘పుష్ప 2’ సినిమా మొదలైనప్పుడే అడిషనల్ కొరియోగ్రాఫర్ గా ఆమెను తీసుకున్నాం. ఆమెతో మరో యువకుడిని తీసుకున్నాం. సినిమాలోని అన్ని పాటలకు ఆమె పని చేస్తున్నది. ఇంకా రెండు పాటలు మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటలను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ పాటలకు కూడా ఆ అమ్మాయి పని చేస్తుంది. ఏడాది క్రితం క్రితం రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలోనే ఆమె పేరు ఉంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. దాన్ని జానీ మాస్టర్ తో చేయించాలి అనుకున్నాం. సరిగ్గా రెండు రోజుల ముందు ఈ గోలంతా జరిగింది” అని చెప్పుకొచ్చారు.

Continues below advertisement

బన్నీ గురించి జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు..

అటు అల్లు అర్జున్ కు జానీ మాస్టర్ ను తొక్కేసి లేడీ కొరియోగ్రాఫర్ ను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని రవి శంకర్ వెల్లడించారు. “సినిమా షూటింగ్ స్పాట్ లో డ్యాన్స్ టీమ్ తో హాయ్ అంటే హాయ్ అనడం తప్ప అల్లు అర్జున్ కు పెద్దగా సంబంధం ఉండదు. జానీ మాస్టర్ ను పక్కన పెట్టి ఆ అమ్మాయిని ప్రమోట్‌ చేయాలని బన్నీ ఎందుకు అనుకుంటారు? ఆయన స్ట్రెచర్ కి తగ్గట్లుగానే ఉంటారు. కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ ఏదో వ్యూస్ కోసం ఏది పడితే అది రాసేస్తున్నారు. ఆ వార్తల్లో అసలు ఎలాంటి వాస్తవం లేదు”అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రవి శంకర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

బాధితురాలికి అండగా బన్నీ అంటూ ప్రచారం

జానీ మాస్టర్‌ పై లేడీ కొరియోగ్రాఫర్‌ లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో బన్నీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ ఆ అమ్మాయికి అండగా నిలిచారని ప్రచారం జరిగింది. తన తదుపరి సినిమాలతో పాటు తమ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించే ప్రతి సినిమాలోనూ ఆమెకు కొరియోగ్రాఫర్ గా అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు  ప్రచారం జరిగింది.  రవి శంకర్ వ్యాఖ్యలతో బన్నీ గురించి వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.   

Also Readఆస్కార్స్‌కు 'లాపతా లేడీస్' - ప్రభాస్ 'కల్కి', 'యానిమల్'ను కాదని మరీ... అందులో ఏముందో తెలుసా?

Continues below advertisement