Top 10 Headlines Today:
తెలంగాణలో పోటీపై టీడీపీ నేడు నిర్ణయం?
తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. బుధవారం రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. ఆ భేటీలో చంద్రబాబు అభిప్రాయాన్ని బట్టి కార్యాచరణ ప్రకటిస్తామని కాసాని ప్రకటించారు. ఇప్పటి వరకూ టీడీపీ హైకమాండ్ కు పోటీ చేసే ఉద్దేశం తక్కువగానే ఉన్నట్లుగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పెద్దగా పార్టీ గురించి పట్టించుకోకపోవడమే దీనికి కారణం. ఒక వేళ పార్టీ పోటీ చేయకపోతే.. ఎవరికి మేలు కలుగుతుందన్న దానిపై రాజకీయవర్గాలు భిన్నమైన అంచనాలు వేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నిజం గెలవాలి బస్ యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును చూసి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాను నేటి నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. నిజం గెలవాలి పేరుతో ఈ యాత్ర చేపట్టనున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభంకానుంది. నేటి నుంచి వారానికి మూడు రోజుల పాటు కార్యకర్తలు, నేతల ఇళ్లకు వెళ్లి భవనేశ్వరి ఓదార్చనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రేపటి నుంచి వైసీపీ యాత్ర
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రతి కార్యక్రమాలలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సీఎం జగన్ సహా ఏపీ మంత్రులు బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా సీం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బస్సుయాత్ర చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే వైసీపీ నేతల బస్సు యాత్రలో భాగంగా రోజూ మూడు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు పర్యటించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం
తెలంగాణ ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక ఇంటర్నల్ పరీక్షను రద్దు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను తొలగిస్తున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో విలీనం చేయడం వల్ల ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ద్వితీయశ్రేణులకు డిమాండ్
ఎన్నికల్లో ప్రచారాలు, హామీలు ఎలా ఉన్నా ప్రజలను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓటు వేయించేది మాత్రం ఈ సెకండ్ లెవల్ నేతలే. ఎలక్షనీరింగ్‌లో వీరిది కీలక పాత్ర అందుకే వారిని కలుపుకొని వెళ్లాలని ఈ మధ్య పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు. వారిని మచ్చిక చేసుకోవాలన్నారు. కొందరు అలుగుతారని అలాంటి వారితో మాట్లాడి ప్రచారం చేయించాలన్నారు. ఈగోకు పోతే అసలుకే మోసం అవుతుందని హెచ్చరించారు. అందుకే బీఆర్ఎస్ నేతలు పాత వారిని బుజ్జగిస్తూ కొత్త వారిని చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణ ఆర్టీసీకి దసరా కానుక
దసరా పండుగ టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణఇకుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. స్పెషల్ బస్సుల ద్వారా రూ.25 కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు దసరా సందర్బంగా 5,500 స్పెషల్ సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడిపింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో గతేడాదితో కంటే అదనంగా 1,302 ప్రత్యేక బస్సులను నడిపింది. పక్కా ప్రణాళికతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడిపించడంతో ఆర్టీసీ ఆదాయం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ ఉన్నాయి. ఒక్కో రీజియన్‌కు సరాసరిగా సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
దక్షిణాఫ్రికా విధ్వంసం- బంగ్లాదేశ్ కకావికలం
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా విధ్వంసం కొనసాగుతోంది. మొదట భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం... తర్వాత ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కూల్చేసి ఘన విజయం సాధించడం ప్రొటీస్‌కు అలవాటుగా మారింది. మరోసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగించిన దక్షిణాఫ్రికా... బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఇప్పటివరకూ ప్రొటీస్ జట్టు గెలిచిన నాలుగు మ్యాచుల్లోనూ ప్రత్యర్థి జట్లపై వందకుపైగా పరుగుల తేడాతో గెలవడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు... ఓపెనర్ క్వింటన్ డికాక్ భారీ శతకం, క్లాసెన్ విధ్వంసంతో నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో 19 సిక్సర్లు బాదడం విశేషం. అనంతరం 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ప్రొటీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 46. 4 ఓవర్లలో 233 పరుగులకే బంగ్లా కుప్పకూలింది. దీంతో 149 పరుగుల తేడాతో సఫారీ జట్టు మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆస్ట్రేలియాకు తిరుగుందా?
ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలన్న పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా.. పసికూన నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. భారత్ వేదికగా జరుగుతున్న మహా సంగ్రామంలో ఆరంభ మ్యాచుల్లో ఓటములతో డీలా పడ్డ కంగారు జట్టు... తర్వాత అద్భుతంగా పుంజుకుని విజయాల బాట పట్టి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీ ఫైనల్ దిశగా మరో ఆడుగు ముందుకు వేయాలని చూస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
'జైలర్' సినిమాలో విలన్ అరెస్టు
'జైలర్' సినిమాలో విలన్ రోల్ చేసిన మలయాళ నటుడు వినాయకన్ (Vinayakan) గుర్తు ఉన్నారా? ప్రేక్షకులు ఇప్పట్లో ఆయనను మర్చిపోవడం కష్టమే. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోయిజం ముందు వినాయకన్ చూపించిన విలనిజం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'జైలర్' విజయంతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో ఆయన పాపులర్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది. అందుకు కారణం... పోలీస్ కేసు! పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
'భగవంత్ కేసరి' సినిమాలో మరో పాట
నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 'భగవంత్ కేసరి' సినిమాలో ఓ పాటను యాడ్ చేయబోతున్నామని చెబుతూ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని నింపారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి