Nijam Gelavali Yatra : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును చూసి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాను నేటి నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. నిజం గెలవాలి పేరుతో ఈ యాత్ర చేపట్టనున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభంకానుంది. నేటి నుంచి వారానికి మూడు రోజుల పాటు కార్యకర్తలు, నేతల ఇళ్లకు వెళ్లి భవనేశ్వరి ఓదార్చనున్నారు. 


నిజం గెలవాలి పేరుతో చేపట్టే యాత్రలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడమే కాకుండా సభలు, సమవేశాల్లో పాల్గొంటారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు అని ప్రజలకు తెలియజేయనున్నారు. ఆయన అరెస్టు వెనుక ఏం జరిగిందో చెప్పనున్నారు. 


ఇవాళ(బుధవారం) ఉదయం 11.30 గంటలకు నారావారిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి యాత్ర ప్రారంభిస్తారు. ముందుగా చంద్రగిరికి చెందిన ప్రవీణ్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. పాకాల మండలం నేండ్రగంటకు చెందిన చిన్నస్వామి నాయుడి ఫ్యామిలీని కలుసుకుంటారు. సాయంత్రానికి చంద్రగిరి మండలం అగరాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడతారు. సాయంత్రానికి నారావారిపల్లిలో బస చేసి రేపు(గురువారం) శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు.






మంగళవారం తిరుమలేశుడిని దర్శించుకున్నారు భువనేశ్వరి. ఆమెకు వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. దర్శనం అనంతరం నారావారిపల్లి చేరుకున్నారు. ఆమెగు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడ గ్రామదేవత గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అత్తామామ సమాధికి నివాళి అర్పించారు. తొలిసారిగా తిరుమలను చంద్రబాబు పక్కన లేకుండా తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లానంటూ భావోధ్వేగమైన ట్వీట్ పెట్టారు భువనేశ్వరి. ఆమె ఇంకా ఏమన్నారంటే..."నా భర్త చంద్రబాబు నాయుడు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను అయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నాను. అని ఎమోషనల్‌ ట్వీట్ చేశారు.