YSRCPs bus yatra starts from October 26:
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రతి కార్యక్రమాలలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సీఎం జగన్ సహా ఏపీ మంత్రులు బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా సీం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బస్సుయాత్ర చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే వైసీపీ నేతల బస్సు యాత్రలో భాగంగా రోజూ మూడు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు పర్యటించనున్నారు.
వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇటీవల వైసీపీ నేతలతో చర్చలో భాగంగా సీఎం జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలో వైసీపీ సామాజిక న్యాయ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను వైసీపీ అధిష్టానం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరిగేలా వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. వారంలో కేవలం ఆదివారాలు మినహా మిగతా 6 రోజులు యాత్ర కొనసాగనుంది. వైసీపీ బస్సు యాత్రకు రూట్ మ్యాప్ ను నేతలు విడుదల చేశారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.
ఏపీ వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ యాత్ర ఉంటుంది. మొత్తంగా డిసెంబర్ 31 వరకూ 60 రోజుల పాటు సభలున్నాయి. ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఈ యాత్రలో ఉండేట్లు సీఎం జగన్ ప్లాన్ చేశారు. గత నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించనున్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక సమన్వయకర్తలు ఈబస్సు యాత్రకు అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాంలకు సీఎం జగన్ సమన్వయ బాధ్యతలను అప్పగించారు.
వైసీపీ బస్సు యాత్ర (సామాజిక న్యాయ యాత్ర) షెడ్యూల్
అక్టోబర్ 26 – ఇచ్చాపురం, తెనాలి, శింగనమల
అక్టోబర్ 27 – గజపతినగరం, నరసాపురం, తిరుపతి
అక్టోబర్ 28 – భీమిలి, చీరాల, పొద్దుటూరు
అక్టోబర్ 30 – పాడేరు, దెందులూరు, ఉదయగిరి
అక్టోబర్ 31 – ఆముదాలవలస, నందిగామ, ఆదోని
నవంబర్ 1 – పార్వతీపురం, కొత్తపేట, కనిగిరి
నవంబర్ 2 – మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు
నవంబర్ 3 – నరసన్నపేట, కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి
నవంబర్ 4 – శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరం
నవంబర్ 6 – గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం
నవంబర్ 7 – రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ
నవంబర్ 8 – సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్
నవంబర్ 9 – అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లె
Also Read: Scam In AP: వైసీపీ నేతలు వందల కోట్ల ఖనిజాన్ని దోచుకుంటున్నారు, మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన ఆరోపణలు
మరోవైపు నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించేందుకు నారా భువనేశ్వరి నారావారిపల్లే నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ యాత్రకు భువనేశ్వరి శ్రీకారం చుట్టనున్నారు. అయితే ముందుగా చంద్రబాబు నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక ప్రాణాలు విడిచిన టీడీపీ అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.