Top 10 Headlines Today:
పవన్ మధ్యవర్తిత్వం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా కాలంగా మూడు పార్టీల కూటమిగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం 2014 కూటమి ఇప్పుడు కలిసి పోటీ చేయాలనుకుంటున్నారు. సీట్లు పంపకాల దాకా ఇంకా వెళ్లలేదు..కనీసం కలిసి పోటీ చేసేలా ఒప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ బీజేపీని కూడా కలపాలని పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఈ కూటమిలోకి టీడీపీని తీసుకు రావాలనుకుంటున్నారు. కానీ టీడీపీ మాత్రం.. బీజేపీ విషయంలో సాఫ్ట్ గానే ఉంటోంది కానీ ఎన్డీఏ కూటమిలోకి అంటే మాత్రం ఆలోచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేడు తెలంగాణలో వర్షాలే
నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం - దక్షిణ ఒడిశా తీరంలో ఉన్న ఆవర్తనం ప్రభావం వల్ల ఈ రోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. ది ఈ అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న అవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మి ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంగి ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. మత్తు పదార్థాలు తీసుకుంటారని.. మంత్రి కేటీఆర్‌పై ఉన్న ఆరోపణలు కిషన్ రెడ్డిపై లేవని, కేటీఆర్ మాదిరి బాలీవుడ్ వాళ్లతో కిషన్ రెడ్డికి దోస్తానా లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఓటర్ల జాబితా సవరణ
ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రతి వారం రాజకీయ పక్షాలకు నియోజకవర్గ స్థాయిలో సమాచారం అందించటం జరుగుతుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. లోపాలు లేని ఓటర్ల తుది జాబితా కోసం ఈ అవకాశాన్ని రాజకీయ పక్షాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కల్కీగా డార్లింగ్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ (Project K Glimpse) వచ్చేసింది. దాంతో పాటు సినిమా టైటిల్ (Project K Title) కూడా వెల్లడించారు. అమెరికాలోని శాండియాగో కామిక్ కాన్ 2023 వేదికగా సినిమా పేరు, వీడియో విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సెంచరీకి చేరువలో కోహ్లీ
ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు టీమిండియా 288 పరుగులు చేసింది. నాలుగు వికెట్లను కోల్పోయింది. మరోసారి ఓపెనింగ్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, జశ్వంత్ జైస్వాల్ అద్భుతంగా రాణించి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మణిపూర్ ఘటనపై ఆవేదన
'నేను ఈ విధంగా చెబుతున్నందుకు సారీ! కానీ, ప్రపంచంలో ఏం జరుగుతోంది?'' అని కథానాయిక రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రశ్నించారు. ఇద్దరు గిరిజన మహిళలను మణిపూర్ (Manipur Incident)లో నగ్నంగా, నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా నడిపించిన ఘటన మీద ఆమె స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సెల్‌ఫోన్ చిచ్చు
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అగ్గిపుల్ల స్వామి పాత్ర పోషిస్తోంది. భార్యభర్తలను విడగొడుతోంది. ఎందుకంటే.. ఈ రోజుల్లో అందరికీ సెల్ ఫోన్ ప్రపంచమైపోయింది. ఫోన్ చేతిలో లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికీ నిమిషం గడవడం లేదు. అందరూ ఫోన్లలో తలలు దూర్చి ఇంట్లో ఒకరి మాట ఒకరు వినిపించుకోవడం లేదనే ఒక కంప్లైంట్ అందరూ చేస్తున్నారు. ఇలాంటి కంప్లైంట్ ఎక్కువగా భార్యలు చెయ్యడం పరిపాటి. అయితే ఇలా భార్య మాటల మీద భర్తలు శ్రద్ధ పెట్టకపోతే వారి వివాహం ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మళ్లీ పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు జులై 20న పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబర్ 18 నుంచి 20 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష(సీబీఆర్‌టీ)లు నిర్వహించనున్నారు. వీటిలో అక్టోబరు 18, 19 తేదీల్లో సివిల్ ఇంజినీరింగ్ పోస్టులకు; అక్టోబరు 20న మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలో అభ్యర్థుల మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సీయూఈటీ-పీజీ ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా 142 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ-పీజీ) ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం (జులై 20) ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి