జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్‌ (JNTUH) పరిధిలోని కళాశాలలన్నింటిలో శుక్రవారం(జులై 21) జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీకి సంబంధించి శుక్రవారం(జులై 21) జరగాల్సిన సెమిస్టర్‌ పరీక్షలను జులై 26కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం (జులై 21) మినహా మిగతా రోజుల్లో జరగాల్సిన పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని పేర్కొంటూ జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మొదట జులై 20, 21 తేదీల్లో విద్యా సంస్థలన్నింటికీ సెలువులు ప్రకటిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 


తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో జులై 21, 22 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు విద్యా సంస్థలను సైతం మూసివేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా శుక్రవారం, శనివారం సెలవులు ప్రకటిస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ప్రైవేట్ సెక్టార్‌లోనూ ఏ ఆఫీసులు తెరవడానికి వీల్లేదని.. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.


ఐటీ ఉద్యోగులకు కూడా..
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో శుక్రవారం, శనివారం రెండ్రోజులు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఇవ్వాలని ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలను కేసీఆర్ ఆదేశించారు. ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ రెండ్రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రైవేట్, ప్రభుత్వం విద్యాసంస్థలు, కార్యాలయాలు తెరవడానికి వీల్లేదన్న మాట. ఈ సెలవులు ప్రకటించేలా సంబంధిత కార్మిక శాఖను కేసీఆర్ ఆదేశించారు. అయితే.. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని.. వీరికి ఎలాంటి ఆటంకం కలిగించొద్దని సీఎం తెలిపారు.


ALSO READ:


ఇంటర్‌ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఇదే చివరి అవకాశం!
ఏపీలోని జూనియర్ కళాశాలల్లో మూడో విడత ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. 2023-24 ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఆగస్టు 17తో ముగియనుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందడానికి ఇదే చివరి విడత అని.. మరోసారి గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే 15 నుంచి జూన్‌ 14 వరకు మొదటి విడత ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జరిగింది. జూన్‌ 14తో మొదటి విడత ప్రవేశాలు, జులై 15 వరకు రెండో విడత ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం చివరి విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


జులై 21, 22 తేదీల్లో 'అగ్రికల్చర్' ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహణ, ఈ సర్టిఫికేట్లు ఉన్నాయా?
వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు జులై 21 , 22 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవయసాయ విశ్వ విద్యాలయం తెలిపింది. ఈ మేరకు బుధవారం (జులై 19) కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికిగాను రెండేళ్ల వ్యవసాయ, సేంద్రీయ డిప్లొమా కోర్సుతోపాటు మూడేళ్ల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం. వెంకటరమణ తెలిపారు. షెడ్యూల్‌ను చూసి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial