Horoscope Today July 21, 2023


మేష రాశి
ఈ రాశివారికి గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో గందరగోళానికి గురవుతారు. స్నేహితులను కలుస్తారు. ప్రేమికుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 


వృషభ రాశి
ఈ రాశివారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.  ఇంటి అలంకరణపై చాలా శ్రద్ధ చూపుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. బయటి ఆహారం తినొద్దు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.


మిథున రాశి
ఈ రాశివారు అసంపూర్తిగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ పరిచయాల సర్కిల్ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఈ రోజు మంచిది. పాత మిత్రులను కలుస్తారు. 


కర్కాటక రాశి
ఈ రాశివారికి శత్రువులు పొంచి ఉన్నారు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు చేయాల్సిన పనులను నిర్లక్ష్యం చేయవద్దు.    మీ ప్రవర్తనను మంచిగా ఉంచుకోండి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలమైనది.


Also Read: రెండు నెలల పాటూ ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం


సింహ రాశి
ఈ రాశివారిలో సృజనాత్మకత పెరుగుతుంది. మీవ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. న్యాయపరమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి. సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి.


కన్యా రాశి
ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు నియంత్రించుకోవాలి. అపరిచితులను నమ్మొద్దు. వ్యాపారం కోసం స్నేహితుల సహాయం తీసుకోండి. అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త. 


తులా రాశి
ఎదుటి వ్యక్తులపట్ల వినయ స్వభావాన్ని ఉంచుకోండి.  కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాల్లో భావోద్వేగానికి లోనవుతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఒప్పందాలను సకాలంలో పూర్తిచేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. 


Also Read:  కల్కి ఎంట్రీతో కలియుగం అంతమైపోతుందా - కల్కి ఎప్పుడు వస్తాడు!


వృశ్చిక రాశి
ఈ రాశివారు తల్లిదండ్రుల అనుమతి తీసుకున్న తర్వాతే కొత్త పని ప్రారంభించండి. ప్రేమ వ్యవహారాల్లో భావోద్వేగానికి లోనవుతారు. చిన్నచిన్న సమస్యలను తేలికగా పరిష్కరించుకుంటారు. ధనలాభం తెచ్చిపెట్టే అవకాశాలొస్తాయి. పిల్లలతో మంచి సమయం గడుపుతారు.


ధనుస్సు రాశి
ఈ రాశివారు అందరి భావాలను అర్థం చేసుకోగలుగుతారు. ప్రేమ సంబంధాలతో కొత్తదనం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో సహోద్యోగులతో కొంత ఇబ్బంది ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు. నిరుద్యోగులు పట్టుదలగా ప్రయత్నించాలి అసహనానికి లోనుకారాదు.


మకర రాశి
ముందుగా అనుకున్న ప్రణాళికలు అమలు చేయడానికి ఈరోజు అనుకూలమైన రోజు. ప్రారంభించిన పనులకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


కుంభ రాశి
ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం మీ భవిష్యత్ కు ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. మీ సమస్యలను పరిష్కరించడంలో జీవిత భాగస్వామి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ప్రేమ సంబంధాలలో గౌరవాన్ని కాపాడుకోండి.  ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం. పనికిరాని విషయాలకు టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.


మీన రాశి
ఈ రాశివారికి కార్యాలయంలో జరిగే కొన్ని విషయాలు ఇబ్బంది పెడతాయి కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబ బాధ్యతలు సమయానికి నెరవేరుస్తారు. తల్లిదండ్రులతో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి. నిర్మాణ పనుల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial