Project K Glimpse : బిగ్ బ్రేకింగ్ - 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ వచ్చేసింది, టైటిల్ కూడా చెప్పేశారు!

Project K is titled Kalki 2898 AD, Watch Glimpse : ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెర పడింది... వెయిట్ ఈజ్ ఓవర్! 'ప్రాజెక్ట్ కె' అంటే ఏంటో వెల్లడించారు. టైటిల్‌తో పాటు వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.

Continues below advertisement

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ (Project K Glimpse) వచ్చేసింది. దాంతో పాటు సినిమా టైటిల్ (Project K Title) కూడా వెల్లడించారు. అమెరికాలోని శాండియాగో కామిక్ కాన్ 2023 వేదికగా సినిమా పేరు, వీడియో విడుదల చేశారు. 

Continues below advertisement

'ప్రాజెక్ట్ కె' అంటే... 'కల్కి'
What Is Project K Movie : 'ప్రాజెక్ట్ కె' అంటే ఏమిటి? కొన్ని రోజులుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని యావత్ భారతీయ ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు. కల్కి... కలియుగ్... కాల్ చక్ర... కురుక్షేత్ర... 'కె' మీనింగ్ ఇదేనంటూ చాలా టైటిల్స్ వినిపించాయి. ఇప్పుడు 'కె' అంటే ఏమిటి? అని డౌట్స్ అవసరం లేదు. 'ప్రాజెక్ట్ కె' అంటే 'కల్కి 2898 ఏడి' (Project K Means Kalki 2898 AD) అని చెప్పేశారు. 

Kalki 2898 AD Glimpse : 'కల్కి' గ్లింప్స్ విషయానికి వస్తే... సినిమా భారీతనం చూపించారు. ఈ వీడియో విడుదల తర్వాత ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని 'కల్కి' టీజర్ లో చెప్పారు. ఆ శక్తిగా ప్రభాస్ ను చూపించారు. కథలో టైమ్ ట్రావెల్ గురించి హింట్ ఇచ్చారు. దీపికా పదుకోన్ సీన్లు కూడా చూపించారు. 

కలియుగ వీరుడిగా...
మన సమరయోధుడిగా!
Prabhas First Look Project K : సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు నుంచి 'ఇదొక పాన్ వరల్డ్ మూవీ' అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ చెబుతూ వస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. సూపర్ హీరో పాత్రను రెబల్ స్టార్ చేస్తున్నారని అర్థమైంది. అయితే... ఆ లుక్ మాత్రం అభిమానులను పూర్తి స్థాయిలో మెప్పించలేదు. విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రశంసలు రావచ్చు. 

Also Read : చిరు లీక్స్ కంటే డేంజర్ - అల్లు అర్జున్ నోట 'పుష్ప 2' డైలాగ్!

'కల్కి' టీమ్ విడుదల చేసిన కామిక్స్ చూస్తే... ప్రపంచమంతా తనను దేవుడిగా కొలవాలని, ప్రజలను బానిసలుగా చేసిన దుష్టశక్తిని ఎదిరించిన సమరయోధుడిగా, కలియుగ వీరుడిగా ప్రభాస్ వీరోచిత పోరాటం చేయనున్నారని అర్థమైంది. 

'ప్రాజెక్ట్ కె'లో ఎవరెవరు ఉన్నారు?
Project K movie cast and crew : 'ప్రాజెక్ట్ కె'లో హిందీలో అగ్ర తార దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రభాస్, దీపిక జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం 'ప్రాజెక్ట్ కె'లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

తెలుగులో 'లోఫర్', హిందీలో 'ఎంఎస్ ధోని', 'బాఘీ 2', 'భారత్', 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమాలు చేసిన దిశా పటానీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే... ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.
'మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. వైజయంతి మూవీస్ పతాకంపై దీనిని సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సుమారు 400 కోట్ల నిర్మాణ వ్యయంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్, అది మారదు : అల్లు అర్జున్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola