పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా 'బ్రో' (Bro Movie). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన తమిళంలో తీసిన 'వినోదయ సీతం' సినిమాకు రీమేక్ ఇది. అయితే... పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులు చేసినట్లు తెలిపారు.  


'బ్రో' ట్రైలర్ శనివారమే!
Bro Trailer Release Date : ఈ నెల 22న... అంటే శనివారం 'బ్రో' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. జూలై 28న 'బ్రో' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు మూడు రోజుల ముందు హైదరాబాద్, శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సహా ఇతర చిత్ర బృందం ఆ వేడుకకు హాజరు కానున్నారు.


Also Read : కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్, అది మారదు : అల్లు అర్జున్






'బ్రో'... రెండు పాటలు వచ్చాయ్!
'బ్రో' నుంచి కొన్ని రోజులు 'మై డియర్ మార్కండేయ' సాంగ్ విడుదల చేశారు. ఈ సినిమాలో రెండో పాట... సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), కేతికా శర్మపై తెరకెక్కించిన 'జాణవులే'ను తాజాగా వచ్చింది. ఈ పాటలకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ స్పందన ఊహించామని సంగీత దర్శకుడు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 


'బ్రో'లో సాయి ధరమ్ తేజ్ జోడీగా 'రొమాంటిక్' భామ కేతికా శర్మ కూడా నటించారు. మరో కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఉన్నారు. ఆమె పాత్ర ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పవన్, తేజ్... ఇద్దరితో తనకు సన్నివేశాలు ఉన్నాయని ప్రియా వారియర్ చెప్పారు. 'మై డియర్ మార్కండేయ' పాటలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేశారు.


Also Read హ్యాట్రిక్ ప్లాపుల్లో ఉన్న హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!


 
'బ్రో' సినిమాలో సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), నర్రా శ్రీను, యువ లక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ప్రధాన తారాగణం. ఇంకా ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఏ.ఎస్. ప్రకాష్, కూర్పు : నవీన్ నూలి, పోరాటాలు : సెల్వ, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, సంగీతం :  ఎస్.ఎస్. థమన్,  సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల,  నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & జీ స్టూడియోస్, నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, కథనం & మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్, రచన & దర్శకత్వం : పి. సముద్రఖని.







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial