రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా రూపొందుతోంది.  అందులో కథానాయిక ఎవరు? మృణాల్ ఠాకూర్! సినిమా ప్రారంభోత్సవంలో కూడా ఆవిడ సందడి చేశారు. అయితే... ఈ సినిమాలో మరో కథానాయికకు చోటు ఉంది. ఫ్లాపుల్లో ఉన్న అమ్మాయికి విజయ్ దేవరకొండ అవకాశం ఇచ్చారు. 


విజయ్ దేవరకొండ సినిమాలో దివ్యాంశ
అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ'లో రెండో కథానాయికగా నటించిన దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) ఉన్నారు కదా! విజయ్ దేవరకొండ సినిమాలో నటించే అవకాశం ఆమెకు లభించింది. 'మజిలీ' తర్వాత దివ్యాంశకు మరో విజయం రాలేదు. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ', సందీప్ కిషన్ 'మైఖేల్', సిద్ధార్థ్ 'టక్కర్' చేశారు. ఆ మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే దివ్యాంశ కౌశిక్ ప్రతిభ మీద నమ్మకం ఉంచింది విజయ్ దేవరకొండ టీం. 






సంక్రాంతికి విజయ్ దేవరకొండ సినిమా
విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి (VD13 Movie Release Date) విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. 


Also Read : 'ప్రాజెక్ట్ కె' అంటే ఏంటి, కాలచక్రమా? కలియుగమా? - రేసులోకి కొత్త టైటిల్?



నాలుగు నెలల వ్యవధిలో రెండు సినిమాలు
సెప్టెంబర్ 1న 'ఖుషి' విడుదల కానుంది. ఆ సినిమా విడుదలైన నాలుగు నెలలకు మరో సినిమాతో సంకాంతికి థియేటర్లలో విజయ్ దేవరకొండ సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి మహేష్ బాబు 'గుంటూరు కారం', ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె', రవితేజ 'ఈగల్', తేజా సజ్జ 'హను - మాన్' కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి.


అమెరికాలో VD13 Movie చిత్రీకరణ!
విజయ్ దేవరకొండ, పరశురామ్ తాజా సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 54వ సినిమా. హీరోకి 13వది. ఈ చిత్రానికి 'ఫ్యామిలీ స్టార్' (VD 13 titled as Family Star) టైటిల్ ఖరారు చేశారట. ఈ సినిమా కోసం 'దిల్' రాజు, దర్శకుడు పరశురామ్, చిత్ర బృందంలో కీలక సభ్యలు కొందరు కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ లొకేషన్స్ రెక్కీ చేశారు. 


Also Read 'హిడింబ' సినిమా రివ్యూ : మనుషులను తినే గిరిజన జాతి మహానగరానికి వస్తే?


దర్శకుడు పరశురామ్ తీసిన చివరి మూడు సినిమాలు చూస్తే... హీరో ఒరిజినల్ పేరును సినిమాలో క్యారెక్టర్ పేరుగా ఫిక్స్ చేశారు. 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు పేరు మహి అలియాస్ మహేష్. 'గీత గోవిందం'లో విజయ్ గోవింద్ పాత్రలో విజయ్ దేవరకొండను చూపించారు. 'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్ పేరు శిరి అలియాస్ శిరీష్. 'ఫ్యామిలీ స్టార్'కు వస్తే విజయ్ దేవరకొండను కుటుంబ రావుగా చూపించబోతున్నారని టాక్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial