MG Motors India: ఎంజీ మోటార్ ఇండియా ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో తన విక్రయాల నివేదికను విడుదల చేసింది. 2023 ప్రథమార్థంలో కంపెనీ 29,000 కంటే ఎక్కువ SUV కార్లను విక్రయించింది. ఈ సంఖ్య గతేడాదితో పోలిస్తే 21 శాతం ఎక్కువ. 2022 ప్రథమార్థంలో కంపెనీ దాదాపు 24,000 యూనిట్లను విక్రయించింది.


మోరిస్ గ్యారేజెస్ ఇండియా 2023 ప్రథమార్థంలో 29,000 కంటే ఎక్కువ వాహనాలను విక్రయించింది. ఇందులో ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ కారు అత్యధికంగా అమ్ముడుపోయింది. దీని తర్వాతి స్థానం ఎంజీ జెడ్ఎస్ ఈవీ రెండో స్థానంలో నిలిచింది. ఎంజీ కంపెనీ భారతదేశానికి వచ్చిన తర్వాత 2023 మార్చిలో జెడ్ఎస్ ఈవీ అత్యధిక రిటైల్ విక్రయాలను నమోదు చేసింది.


త్వరలో కొత్త కార్లు కూడా...
ఎంజీ ఇండియా ప్రస్తుతం భారతదేశంలో నాలుగు ఐసీఈ ఇంజిన్ ఎస్‌యూవీలు, రెండు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. కంపెనీ ఎస్‌యూవీ లైనప్‌లో ఆస్టర్, హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీలను విక్రయిస్తుంది.


ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే కంపెనీ  రూ. 5,000 కోట్ల పెట్టుబడిని పెట్టింది. 2028 నాటికి భారతదేశంలో నాలుగు నుంచి ఐదు కొత్త కార్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది.


ఎంజీ మోటార్స్ ఇటీవల కామెట్ ఈవీ రూపంలో దేశంలో తన రెండో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఇంతకు ముందు ఎంజీలో జెడ్ఎస్ ఈవీ మాత్రమే ఎలక్ట్రిక్ కారు. MG కామెట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.98 లక్షల నుంచి రూ.9.98 లక్షల మధ్య ఉంది. ఈ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.


ఎంజీ మోటార్ నుంచి ఈ కారుపై వినియోగదారుల కోసం ప్రత్యేక బైబ్యాక్ స్కీమ్ కూడా ఉంది. దీని కింద వినియోగదారులు కామెట్‌ను మూడేళ్ల తర్వాత కంపెనీకి తిరిగి ఇవ్వవచ్చు. దాని ధరలో 60 శాతం తిరిగి పొందవచ్చు. ఈ కారుకు సంబంధించి గత నెలలో 1,184 యూనిట్లు అమ్ముడు పోయాయి. గత నెలలో ఎంజీకి సంబంధించి అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా నిలిచింది.


2023 జూన్‌లో ఎంజీ మోటార్ ఇండియాలో హెక్టర్, హెక్టర్ ప్లస్‌లకు సంబంధించి అత్యధికంగా 2,170 యూనిట్లు విక్రయించింది. ఎంజీ కామెట్ రెండో స్థానంలో ఉండగా, ఎంజీ ఆస్టర్ మూడో స్థానంలో, జెడ్ఎస్ ఈవీ నాలుగో స్థానంలో, గ్లోస్టర్‌ ఐదో స్థానంలో ఉన్నాయి.


ఎంజీ జెడ్ ఈవీ వెలుపలి భాగంలో ఎల్ఈడీ లైట్ బార్, ఓఆర్వీఎంలను కనెక్ట్ చేసే ఎల్ఈడీ స్ట్రిప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌తో కూడిన ఆధునిక డిజైన్ ఉంది. ఇది 12 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఈ కారు మూడు మీటర్ల పొడవు ఉంది. అంతేకాకుండా 1,640 మిల్లీమీటర్ల ఎత్తు, 1,505 మిల్లీమీటర్ల వెడల్పు, 2,010 మిల్లీమీటర్ల పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఎంజీ కామెట్ ఈవీ డ్యూయల్ టోన్ (యాపిల్ గ్రీన్ + స్టార్రీ బ్లాక్, క్యాండీ వైట్ + స్టార్రీ బ్లాక్), యాపిల్ గ్రీన్, క్యాండీ వైట్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్‌తో సహా ఐదు రకాల కలర్ ఆప్షన్లను పొందుతుంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial