తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు జులై 20న పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబర్ 18 నుంచి 20 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష(సీబీఆర్‌టీ)లు నిర్వహించనున్నారు. వీటిలో అక్టోబరు 18, 19 తేదీల్లో సివిల్ ఇంజినీరింగ్ పోస్టులకు; అక్టోబరు 20న మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలో అభ్యర్థుల మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించనున్నారు.
నార్మలైజేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరు 12న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల రెండో జాబితా వెల్లడి, 63 మంది ఎంపిక!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల రెండో ఎంపిక జాబితా విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థల జాబితాను అందుబాటులో ఉంచారు. రెండో జాబితాలో మొత్తం 63 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపికయ్యారు. ఏపీ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్‌లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి జాబితాలో 90 అభ్యర్థుల ఎంపిక కాగా 70 విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీల భర్తీకి గాను రెండో జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు జులై 24, 25, 26వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, 'స్టేజ్-2' దరఖాస్తు తేదీలు వెల్లడి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎస్‌ఐ (సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జులై 21న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులందరూ సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial