Top 10 Headlines Today:  


పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారు?


ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వను... ఇది మొన్నటి వరకు పవన్ కల్యాణ్ నోటి వెంట వచ్చిన మాట. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధం... ఇది నేడు చేస్తున్న కామెంట్. అసలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు చాలా డైనమిక్‌గా ఉంటున్నాయి. ఏ గంటకు ఏం జరుగుతుందో అంత ఈజీగా అంచనాకు అందడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బీజేపీ టార్గెట్ ఏంటీ?


హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయాలన్న అంశాన్ని మెల్లగా ప్రజల్లో పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.  రెండో రాజధాని చేయాలంటే..  హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాల్సి ఉంటుంది. హఠాత్తుగా.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ అంశాన్ని లేవనెత్తారు. గవర్నర్ గా పదవి కాలం ముగిసిన తర్వాత సైలెంట్ ఉన్న ఆయన హఠాత్తుగా తెరపైకి వచ్చారు. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలన్నారు. అంబేద్కర్ కూడా అదే కోరుకున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై పార్టీలన్నీ ఆలోచించాలని పిలుపునిచ్చారు.  హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినప్పుడు సీఎం కేసీఆర్ సమక్షంలోనే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్.. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడం అంబేద్కర్ స్వప్నమన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయలేదు. కానీ అలాంటి ఆలోచన బీజేపీకి ఉందని తర్వాత పరిణామాలతో వెల్లడవుతూ వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఎండలు బాబోయ్‌ ఎండలు


బిపర్‌జోయ్ తుపాను తెలుగు రాష్ట్రాలపై పెద్ద ప్రభావమే చూపించింది. ఎప్పుడో వారం రోజుల క్రితం ఏపీని తాకిన రుతుపవనాలు ముందుకు కదలడం లేదు. తుపాను కారణంగా వాటి విస్తరణలో మందగమనం ఏర్పడింది. మరో రెండు రోజులు అయితే కానీ రుతుపవనాల్లో కదలిక ఉండబోదని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కేస్‌ అప్‌డేట్


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరుగురు టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ సభ్యులైన బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్. సత్యనారాయణ, రమావత్ ధన్ సింగ్, సుమిత్ర ఆనంద్ తనోబా, ఆరవెల్లి చంద్రశేఖర్ నియామకం పరిశీలించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ప్రచార వ్యూహంలో టీడీపీ దూకుడుగా ఉందా?


 ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు చంద్రబాబునాయుడు వివిధ కార్యక్రమాల పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. అదే సమయంలో ఇంచార్జులు అందర్నీ ప్రజల్లోకి  పంపేందుకు మినీ మేనిఫెస్టోను రెడీ చేసి ఐదు బస్సులను నియోజకవర్గాలకు పంపుతున్నారు. ఇదే క్రమంలో కొన్ని ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసుకుంటున్నారు. ఓ వైపు సోషల్ మీడియాలో ఉద్దృతంగా ప్రచారం చేస్తూనే క్షేత్ర స్థాయిలో ప్రతి ఒటర్ నూ కలిసేందుకు టీడీపీ పక్కా ప్రణాళికలు వేసుకుంది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మరుభూమిలో విషాదం


కుప్పం నియోజకవర్గంలోని తంబిగానిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. దహన సంస్కారాలకు వెళ్లిన వారు విద్యుత్ ఘాతుకానికి గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. విద్యుత్ తీగలు ఒక్కసారిగా వీరి మీద పడటంతో ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలంగాణలో మరో 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు: మంత్రి హ‌రీశ్‌రావు


తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించడానికి ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాదికి అన్ని జిల్లాల్లో ఒక్కో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ లక్ష్యమని గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బిల్లు గుండె గుబేల్‌


కర్ణాటకకు చెందిన ఓ ఇంటి యజమాని కరెంటు బిల్లును చూసి ఖంగుతిన్నాడు. ఇది నిజంగా తన ఇంటికి వచ్చిందేనా అని పదే పదే మీటర్ నంబర్ చూసుకుంటూ ఉండిపోయాడు. చూస్తే అంతా కరెక్టుగానే ఉంది కానీ.. రెండు వేలో, మూడు వేలో రావాల్సిన బిల్లే లక్షల్లో వచ్చింది. ఏకంగా ఏడు లక్షలు రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి తనకు వచ్చిన బిల్లును చూపించాడు. తన ఇంట్లో వాడుతున్న వాటి గురించి చెప్పి.. బావురుమన్నాడు. తప్పు తమవద్దే జరిగిందని తెలుసుకున్న అధికారులు మరో బిల్లును ఇచ్చి అతడిని ఇంటికి పంపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


యాషెస్ రణరంగానికి అద్భుత ఆరంభం  


ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాషెస్ రణరంగానికి అద్భుత ఆరంభం  దక్కింది.  ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. దూకుడుకు మారుపేరైన కంగారూలనే కంగారెత్తించింది.  ఈ క్రమంలో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయినా ‘బజ్‌బాల్’ దృక్పథాన్ని మాత్రం వీడలేదు.  తొలి రోజు 78 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్..8 వికెట్లు కోల్పోయి  393 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ మాజీ సారథి  జో రూట్ (152 బంతుల్లో  118 నాటౌట్,  7 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మరో తెలంగాణ యాసతో చిత్రం 


ఈమధ్య మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యువ దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంటున్నారు. వీరిలో కొంతమంది ఎంట్రీ తోనే పెద్ద హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకుంటే, మరి కొంతమంది మాత్రం నూతన తారాగణంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీసి సక్సెస్ అందుకుంటున్నారు. అలా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటి ఆడియన్స్ కూడా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ పేర్లను చూడకుండా కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమాలను ఆదరిస్తున్నారు. ఆ కోవలో ఇప్పటికే చాలా సినిమాల సక్సెస్ అయ్యాయి. ఇక తాజాగా మరో సరికొత్త కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరే 'భీమదేవరపల్లి బ్రాంచి'. తెర వెనక ఉండి ఒక సంఘటనని లేదా ఓ సందర్భాన్ని ఒక సామాన్యుడిని వైరల్ చేసి హీరోలుగా చేస్తారు కొందరు.. టాప్ టెన్ యూట్యూబర్స్, టాప్ టెన్ ట్విట్టరైట్స్, టాప్ టెన్ ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, టాప్ టెన్ ఫేస్బుక్ యూజర్స్. వీళ్లంతా తెర వెనక హీరోలే.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి