తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించడానికి ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాదికి అన్ని జిల్లాల్లో ఒక్కో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ లక్ష్యమని గుర్తుచేశారు.


జూన్‌ 16న సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు జిల్లా స్థాయిలోనే స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ప్రతి జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను స్థాపిస్తున్నామన్నారు. ఇప్పటికే 33 జిల్లాలకు 25 జిల్లాల్లో ఏర్పాటు చేశామని, మిగిలిన ఎనిమిది జిల్లాల్లోనూ ప్రారంభించేందుకు అవసరమైన భూకేటాయింపులు, ఇతర పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.


జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది కలగకుండా జాతీయ వైద్యమండలి మార్గదర్శకాల ప్రకారం మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఇప్పటికే ప్రారంభించిన వైద్య కళాశాలలు ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం నడుచుకునేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌లపైనే ఉందన్నారు.


రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మౌలిక వసతుల కల్పనతోపాటు వైద్య సిబ్బందిని నియమిస్తూ ఆరోగ్యరంగాన్ని పటిష్ఠం చేసినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ చర్యలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల తెలంగాణ వైద్యరంగంలోని వివిధ విభాగాల్లో చాలా ముందుందని. అన్ని రంగాల్లో కలిపి రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి వెల్లడించారు. ఈమేరకు ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలను అందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని హరీశ్‌రావు కోరారు.


Also Read:


ఎన్ఐఈఎల్ఐటీలో డిప్లొమా, బీసీఏ, ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
అగర్తలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఈఎల్ఐటీ) 2023 విద్యా సంవత్సరానికి డిప్లొమా, బీసీఏ, ఎంఎస్సీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరకఖాస్తులు కోరుతుంది. కోర్సులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్‌లో ఏదైనా రెండు సబ్జెక్టులతో హెచ్‌ఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఇక నచ్చిన కాలేజీకి మారొచ్చు - ట్రాన్స్‌ఫ‌ర్లకు జేఎన్‌టీయూ అనుమతి!
జేఎన్‌టీయూ ప‌రిధిలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న విద్యార్థులు.. ఒక కాలేజీ నుంచి మ‌రొక కాలేజీకి మారేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కళాశాలల మార్పునకు అనుమతిస్తూ జేఎన్‌టీయూ హైదరాబాద్ జూన్ 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి, ఒక యూనివర్సిటీ నుంచి మరో యూనివర్సిటికి, అటానమస్‌ కాలేజీ నుంచి నాన్‌ అటానమస్‌ కాలేజీకి, ఇలా రకరకాల పద్ధతిలో విద్యార్థులకు ట్రాన్స్‌పర్‌ చేసుకునే అనుమతి కోరుతూ విద్యార్థులు దరఖాస్తు కోరుతారు. స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫ‌ర్లు అనేక కారణాలతో ముడిపడి ఉంటాయి. అందులో ప్రధానంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫ‌ర్‌ అయ్యే వెసులుబాటు కల్పించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..