Top 10 Headlines Today:
నేడు విపక్షాల సమావేశం
సోమ, మంగళ వారాల్లో బెంగళూరు వేదికగా జరిగే విపక్ష పార్టీల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హాజరుకానున్నట్లు ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఢిల్లీ లో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత ఆప్ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ ప్రకటన వెలువడిన తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ భేటీ అనంతరం ఆప్ విపక్షాల భేటీలో పాల్గొననున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ నాయకత్వంలో జరిగే విపక్షాల భేటీకి ఆప్ హాజరు అవుతుందా అని సమావేశానికి ముందు అడిగినప్పుడు.. రాజకీయ వ్యవహారాల కమిటీ -పీఏసీ తర్వాత మాత్రమే దాని గురించి చెప్పగలమని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ సమావేశానికి రాఘవ్ చద్దా, దుర్గేష్ పాఠక్, గోపాల్ రాయ్ సహా పలువురు అగ్రనేతలు హాజరు అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో స్పానిష్ యువ సంచలనం
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో స్పానిష్ యువ సంచలనం కార్లొస్ అల్కరాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలిసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు. ఆదివారం రాత్రి హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కార్లొస్ అల్కరాస్ 1-6, 7-6(6), 6-1, 3-6, 6-4 తేడాతో సెర్బియన్ సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ పై ఉత్కంఠ పోరులో గెలుపొందాడు. ఓపెన్ టెన్నిస్ లో 2వ మేజర్ గ్రాండ్ స్లామ్ నెగ్గిన 5వ పిన్న వయస్కుడు అల్కరాస్. ఓపెన్ ఎరాలో బేకర్, Bjorg తరువాత వింబుల్డన్ నెగ్గిన మూడో అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు అల్కరాస్. గ్రాండ్ స్లామ్ ఫైనల్లో జకోవిచ్ ను ఓడించిన రెండో అతిపిన్న వయస్కుడిగా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తన పట్టుదలతో అనుభవాన్ని ఓడించాడు యువ కెరటం అల్కరాజ్.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రామచంద్రాపురంలో ఎంపీ వర్సెస్ మంత్రి
ఒకరు వైసీపీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు.. మరొకరు ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. ఇప్పుడు మంత్రి. అయితే వీరిద్ధరి మధ్య రామచంద్రపురం నియోజకవర్గం కేంద్రంగా టిక్కెట్ రగడ రాజుకుంటోంది. ఒకప్పుడు సొంత నియోజకవర్గమైన రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు నెగ్గిన పిల్లి సుభాష్ చంద్రబోస్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పక్క నియోజకవర్గం అయిన మండపేట వెళ్లాల్సివచ్చింది. బోస్ సొంత నియోజకవర్గం అయిన రామచంద్రపురంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రంగంలోకి దింపింది వైసీపీ అధిష్టానం. అయితే మండపేటలో బోస్ ఓడిపోతే రామచంద్రపురంలో వేణు నెగ్గడం జరిగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నరసరావుపేటలో టీడీపీ, వైసీపీ ఫైట్
పల్నాడు జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ నేతల మధ్య జరిగిన కొట్లాట రాళ్లదాడికి దారి తీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరసర్పం రాళ్లు విసురుకుంటూ.. కర్రలతో బాదుకున్నారు. టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు టార్గెట్ గా దాడి జరిగినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలో అరవింద్ బాబు కారు ధ్వంసం కాగా..ఓ పోలీసు వాహనానికి అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టీడీపీ, వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేడు స్కూల్స్‌కు సెలవు
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. నేడు విద్యాసంస్థలకు సెలవు. బోనాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (జులై 17) సెలవు ప్రకటించింది. ఆదివారం, నేడు సెలవు కావడంతో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా రెండు రోజులు హాలిడేస్ వచ్చాయి. దీంతో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తున్నారు. తిరిగి మంగళవారం (జులై 18) స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి.కాగా, హైదరాబాద్ పాతబస్తీ లో ఆది, సోమవారాల్లో బోనాల వేడుకలు సజావుగా నిర్వహించేందుకు సౌత్ జోన్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. బోనాలు జరిగే ప్రాంతాల్లో వాహనాలురాకుండా.. ఇతర మార్గాలకు వాహనాలను మళ్లిస్తున్నారు. రెండు రోజులూ సౌత్ జోన్‌లోనే దాదాపు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మరోసారి గవర్నర్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇదివరకే రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభానికి, సమ్మక్క సారక్క జాతర సహా పలు వేడుకలకు గవర్నర్ తమిళిసైని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించలేదని తెలిసిందే. తాజాగా జరుగుతున్న బోనాల పండుగకు కూడా తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని గవర్నర్ తమిళిసై తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ అయిన బోనాలను ఘనంగా నిర్వహిస్తోంది. కానీ పాతబస్తీలోని లాల్‌దర్వాజా బోనాలకు సైతం తనకు ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో రాజ్‌భవన్‌లో నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. నల్లపోచమ్మ అమ్మవారికి తమిళిసై బోనం సమర్పించి వడి బియ్యం పోశారు. బోనం సమర్పించడంలో మహిళా సిబ్బంది ఆమెకు సహకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఓటమితో ప్రారంభం
ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-1 తేడాతో ఓడించిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో దారుణ ఓటమి ఎదురైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించినా బ్యాటర్ల వైఫల్యంతో మొదటి వన్డేలో అవమానకరమైన ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 153 పరుగులను కూడా భారత బ్యాటర్లు ఛేదించలేకపోయారు. 113 పరుగులకే కుప్పకూలి.. 40 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆస్తిలో కుమార్తెలకు హక్కు
తండ్రి ఆస్తిపై, పూర్వీకుల నుంచి లభించే ఆస్తిపై కుమారుడితో పాటు కూతురికి హక్కులపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు కుమారుడితో పాటు సమాన హక్కు ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముగ్గురు అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల మధ్య తండ్రి ఆస్తుల పంపకాల విషయంపై ఒడిశా హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఇలా రిపోర్టింగ్ చేయండి
తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్‌లో భాగంగా జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. అలాట్‌మెంట్ జాబితాలో అభ్యర్థులు వారికి కేటాయించిన కళాశాల, కోర్సుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో జులై 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ ఆర్డర్ పొందిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్‌కు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
గుంటూరు కారం అప్‌డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు ఏడాదిపైనే అయింది. ఇప్పటికీ సినిమా షూటింగ్ పూర్తవలేదు. మధ్య మధ్య లో అనేక కారణాల వల్ల మూవీ లేట్ అవుతూ వస్తోంది. దానికి తోడు ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా సరైన క్లారిటీ రాకపోవడంతో మహేష్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో మూవీ తర్వాత అప్డేట్ ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా నటి మీనాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యలు మహేష్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే దానిపై మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. మీనాక్షి తాజా వ్యాఖ్యలతో ‘గుంటూరు కారం’ లో హీరోయిన్ గా మీనాక్షి ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి