Tips to Store Your Car For Long Time: కొన్ని సార్లు మన కారును ఎక్కువ సేపు పార్కింగ్‌లో ఉంచాల్సి వస్తుంది. నిజానికి కారును ఎక్కువసేపు ఒకే చోట పార్క్ చేస్తే జేబుకు చిల్లు పడే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు పార్కింగ్ చేయడం వల్ల మీ కారు టైర్లు, ఇతర భాగాలు పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీరు చాలా రోజులు మీ వాహనాన్ని ఒకే చోట పార్క్ చేయవలసి వస్తే కొన్ని టిప్స్ పాటించండి.
1. కారును ఎక్కువసేపు పార్క్ చేసినపుడు, అది బ్యాటరీని డిశ్చార్జ్ చేస్తుంది. అలాగే బ్యాటరీ సామర్థ్యం వేగంగా తగ్గడం మొదలవుతుంది. దీన్ని నివారించడానికి కనీసం 10 రోజులకు ఒకసారి వాహనాన్ని స్టార్ట్ చేయండి. కొంత సమయం పాటు అలా స్టార్ట్ చేసి వదిలేయండి. ఇది బ్యాటరీ, ఇంజిన్ రెండింటి యొక్క జీవితాన్ని కాపాడుతుంది.
2. వాహనాన్ని ఎక్కువసేపు ఒకే చోట పార్క్ చేస్తే దాని టైర్లు పాడైపోయి ఒకే చోట అతుక్కుపోతాయి. దీన్ని నివారించడానికి కనీసం 15 రోజులకు ఒకసారి వాహనాన్ని కొంత దూరం నడపండి. దీని కారణంగా కారు బ్రేకులు, క్లచ్, ఏసీ, బ్యాటరీ, ఇంజిన్ మెయింటెయిన్ అవుతాయి.
3. మీరు వాహనాన్ని ఎక్కువసేపు పార్క్ చేయాలనుకుంటే, హ్యాండ్‌బ్రేక్ వేసి వదిలివేయవద్దు. దీని కారణంగా బ్రేక్ ప్యాడ్‌లు జామ్ అవుతాయి. హ్యాండ్‌బ్రేక్‌ను రిలీజ్ చేసినప్పుడు అవి విరిగిపోయే అవకాశం ఉంది. దీని కారణంగా వాటిని మార్చడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని నివారించడానికి కారును మొదటి గేర్‌లో ఉంచి చక్రాల క్రింద చెక్క లేదా ఇటుక ముక్కను ఉంచండి.
4. వాహనం ఎక్కువసేపు పార్క్ చేసినప్పటికీ ట్యాంక్ నిండుగా ఉంచండి. ఎందుకంటే ఇది ఇంధన ట్యాంక్ లోపల తుప్పు పట్టకుండా చేస్తుంది. అలాగే ట్యాంక్‌లో తేమ కూడా చేరదు. ఒకవేళ మీకు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో వాహనం అవసరం అయినప్పుడు మీ వాహనంలో తగినంత ఇంధనం కూడా ఉంటుంది.
మరోవైపు సుదీర్ఘ చర్చల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా ఇప్పుడు భారతదేశంలో తన కార్లను తయారు చేసేందుకు సిద్ధం అయింది. బిజినెస్ టుడే సంస్థ కథనం ప్రకారం ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతదేశంలో తన తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి విక్రయించేందుకు అవసరం అయిన ప్రాథమిక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది.
ఏడాదికి ఐదు లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో గిగాఫ్యాక్టరీని నిర్మించాలనేది టెస్లా ప్రాథమిక ప్రణాళిక అని తెలుస్తోంది. టెస్లా తన ఎలక్ట్రిక్ వాహనాల లైనప్‌ను భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాని కోసం అవసరమైన బలమైన మౌలిక సదుపాయాలను కూడా కలిగి ఉంది. కంపెనీ తన ఎలక్ట్రిక్ కారును తక్కువ ధరలోనే భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు టెస్లా లాంచ్ చేయనున్న ఈ కారు గురించి ఎలాంటి సమాచారం రాలేదు.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial