Top 10 Headlines Today


సమన్వయ కమిటీ


ఎవరూ ఊహించని విధంగా రాజమండ్రిలో టీడీపీ,  జనసేన పొత్తుపై సంచలన ప్రకటన చేసిన పవన్‌ కల్యాణ్... దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. శనివారం మంగళగిరిలో పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన జనసేనాని..కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసే టైంలో ఎవరూ ఇగోలకు పోవద్దని నేతలకు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హ్యాండ్‌ ఇచ్చినట్టేనా!


వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నారు. అగ్రనేతలంతా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకున్నారు. కానీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. డీకే శివకుమార్ తో షర్మిల సమావేశం అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఢిల్లీలో రాహుల్, సోనియాలతో షర్మిల చర్చలు జరిపారు.. ఆ తర్వాత ఎలాంటి సమాచారం షర్మిలకు అందలేదు. ఆమె ఎదురు చూస్తున్నారు. శివకుమార్ కూడా ఏదీ చెప్పడం లేదు. దాంతో  ముందు ముందు తన రాజకీయ భవిష్యత్‌పై షర్మిలకు టెన్షన్ ప్రారంభమయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


లోకేష్‌కు సవాల్‌


రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి మీద చర్చకు రమ్మనమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నారా లోకేష్ పిలవడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఒక్క స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. ఈ.డీ., ఐ.టీ, సిఐడి అధికారులు విచారణకు రమ్మనమని లోకేష్ ను పిలుస్తుంటే, దానిపై మాట్లాడకుండా సీఎం జగన్ ను చర్చకు పిలిచిన లోకేష్ తన స్థాయి ఏంటో, బతుకేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సింధుతో అమిత్‌షా భేటీ


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. సంపర్క్​ సే సంవర్ధన్​లో భాగంగా బ్యాండ్మిటన్​ క్రీడాకారిణి పీవీ సింధులో అమిత్ షా, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. పీవీ సింధుతో భేటీ అనంతరం అమిత్ షా స్పందించారు. సింధు అద్భుతమైన క్రీడాకారిణి. ఆమె అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేసిందన్నారు. ఆట పట్ల ఆమె నిబద్ధత, చేసిన కృషి, అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఫైనల్‌ పోరు నేడు


మూడు వారాల క్రితం ముల్తాన్ (పాకిస్తాన్) వేదికగా మొదలై  పాక్‌లో ఎండ, ఉక్కపోత..  లంకలో కుండపోత వాన మధ్య  సాగుతున్న ఆసియా కప్ తుది అంకానికి చేరింది.  ఇదివరకే ఫైనల్ చేరిన భారత్ - శ్రీలంకలు నేడు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.  2018లో ఆసియా కప్ తర్వాత  మేజర్ టోర్నీ ఒక్కటి కూడా గెలవని భారత్‌..  కొద్దిరోజుల్లో స్వదేశంలో జరుగబోయే  వన్డే వరల్డ్ కప్ ముందు ఈ టోర్నీని దక్కించుకుని మెగా టోర్నీలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నది.  మరోవైపు ఆసియా కప్ అంటేనే  దుమ్మురేపే లంకేయులూ  భారత్‌కు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హిమంత బిశ్వ శర్మ ఫైర్‌


I.N.D.I.A కూటమి 14  న్యూస్ యాంకర్‌లపై నిషేధం విధించడంపై పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ తీరు ఇదే అంటూ బీజేపీ ఇప్పటికే మండి పడుతోంది. మీడియాని నిషేధించడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. మీడియాపై నిషేధం విధించడం పిల్లలాటగా ఉందని, కాంగ్రెస్‌కి ఇదేం కొత్త కాదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియాపై సెన్సార్ విధిస్తారని హెచ్చరించారు. 1975 నాటి రోజుల్ని కాంగ్రెస్ మరోసారి గుర్తు చేస్తోందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


దోస్త్ కోసం మరో కౌన్సెలింగ్‌


తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 21 నుంచి దోస్త్‌ 'స్పెషల్ రౌండ్' కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి శనివారం(సెప్టెంబర్‌ 16) షెడ్యూలును విడుదల చేశారు. ఇప్పటికే ఆయా కళాశాలల్లో చేరిన వారు అదే కళాశాలలో మరో కోర్సులోకి మారేందుకు ఇంట్రా కాలేజీ రెండో విడతకు కూడా అనుమతి ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అంతా ఉల్టాపుల్టా


‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 (Bigg Boss Telugu Season 7) ఎపిసోడ్ 15.. శనివారం ప్రసారమైంది. ప్రస్తుతం హోస్‌లో ఒక వైపు గౌతమ్, శుభశ్రీ.. మరోవైపు రతిక, ప్రిన్స్ యావర్‌ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోంది. ఇదంతా నాగార్జున ప్రత్యక్షంగా చూశారు. గత రెండు రోజులుగా రతిక, యావర్‌లు కొత్త లవ్ డ్రామా మొదలుపెట్టారు. దీంతో హౌస్‌మేట్స్ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ త్వరలో అంటూ.. వారిని ఆటపట్టించారు. మరోవైపు ప్రశాంత్.. ప్రిన్స్‌ను ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


షారుక్ Vs సల్మాన్ 


బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఓ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ ప్రాజెక్టు ఉండనుందట. ఈ ఏడాది ఆరంభంలో సల్మాన్, షారుక్ ని ఒకే సినిమాలో చూపించి బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లు కొల్లగొట్టిన యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈసారి అంతకుమించి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. 'పఠాన్' లో షారుక్, సల్మాన్ ని చూసి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయారు. అయితే ఈసారి షారుక్ Vs సల్మాన్ ల మధ్య భీకర పోరు ఉంటుందని బాలీవుడ్ లో టాక్ నడుస్తుండగా, ఎట్టకేలకు ఈ విషయంపై తాజాగా ఓ క్లారిటీ వచ్చినట్లు బాలీవుడ్ నివేదికలు చెబుతున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పెళ్లి పనుల్లో బిజీ 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాల నడుమ ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పెద్దల అనుమతితో పెళ్లి పీటల మీదికి ఎక్కబోతున్నారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెడ్డింగ్ ప్లానర్ ను కూడా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి