Shodasa Ganapathi: లంబోదరుడి 16 రూపాలను షోడస వినాయకులు అని పిలుస్తారు.... వీటిని కేవలం వినాయకచవితి రోజు మాత్రమే కాదు నిత్యం పూజిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి...


1.బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతుల్లో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తాడు.  ఈ బాల గణపతిని పూజిస్తే బుద్ధి చురుకుగా ఉంటుంది


శ్లోకం
కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్


2. తరుణ గణపతి
ఈ వినాయకుడి రూపానికి 8 చేతులుంటాయి. కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తాడు. 


శ్లోకం
పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః 
ధత్తే సదాయ సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః


3.భక్త గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతుల్లో కొబ్బరికాయ, అరటిపండు.. ఎడమ వైపు చేతుల్లో మామిడి పండు, పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.


శ్లోకం
నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్


Also Read: మీ స్నేహితులు, సన్నిహితులకు వినాయకచవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!


4. వీరగణపతి
ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి. కుడి వైపు చేతుల్లో బాణం, బేతాళుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతంతో దర్శనమిస్తారు. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ఉంటుంది


శ్లోకం
బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి


5. శక్తి గణపతి
నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం, విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదైనా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.


శ్లోకం
ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే


6. ద్విజ గణపతి
ఈ వినాయకుడు  కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ద్విజ గణపయ్యను పూజిస్తే తెలివితేటలు పెరుగుతాయి


శ్లోకం
యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః


Also Read: వినాయకుడికి పత్రి పూజ - మరే దేవుడికీ లేదెందుకు!


7. సిద్ధి /పింగల గణపతి
ఈ గణపతిని పూజిస్తే ప్రారంభించిన పనులలో అపజయం అనేది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తాడు.


శ్లోకం
పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల


8. ఉచ్ఛిష్ట గణపతి
కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడు కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తాడు.


శ్లోకం
నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః


9.విఘ్న గణపతి
గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ  రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తాడు. 


శ్లోకం
శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః 


10.క్షిప్త గణపతి
ఈ వినాయకుడు  కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు.


శ్లోకం
దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్


Also Read: శివుడికి పంచారామ క్షేత్రాల్లా గణేషుడికి అష్టవినాయక ఆలయాలు, వీటి విశిష్టత ఏంటంటే!


11.హేరంబ గణపతి
ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి. కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తాడు. ఈ వినాయకుడు ఆపదలు నివారిస్తాడు. 


శ్లోకం
అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా


12.లక్ష్మీ గణపతి
ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి. కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తాడు. ఈ గణపయ్యను పూజిస్తే ఐశ్వర్యం. 


శ్లోకం
బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే


13.మహాగణపతి
ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి.  కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి దర్శనమిస్తాడు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతాయి


శ్లోకం
హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం 
రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్
బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే


Also Read: వినాయ‌క చ‌వితి 18, 19 తేదీల్లో ఏ రోజు జ‌రుపుకోవాలి - పండితులు ఏమంటున్నారు!


14. విజయ గణపతి
సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి.  కుడి వైపు చేతుల్లో పాశం, విరిగిన దంతం ధరించి ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండుతో కనిపిస్తారు.


శ్లోకం
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః


15.నృత్య గణపతి
సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరిస్తాడు.


శ్లోకం
పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్


16.ఊర్ధ్వ గణపతి
ఈ గణపతి కుడి చేతుల్లో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరుకు, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తాడు. ఈ గణపతిని పూజిస్తే కారాగార బాధల నుంచి విముక్తి కలుగుతుందట.


శ్లోకం
కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల 
లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ 
యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః 


పసుపు గణపతి పూజ లింక్ ఇది


గణపతి షోడసోపచార పూజ లింక్ ఇది


చదువుకోవాల్సిన కథలివే....