సెప్టెంబరు 17 రాశిఫలాలు


మేష రాశి


మేష రాశి ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. ఇంటి పెద్దలు మీతో చాలా సంతోషంగా ఉంటారు. న్యాయపరమైన విషయాల్లో మీరు అదృష్టవంతులు అవుతారు. వ్యాపార పనుల్లో ఊపు ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 


వృషభ రాశి


ఈ రోజు మీకు గొప్ప రోజు అవుతుంది. పని సామర్థ్యం పెరుగుతుంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీ శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి కానీ ఆలస్యంగా వస్తాయి. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.


మిధున రాశిt


మీరు ఏదో ఒక విషయంలో ఒత్తిడికి లోనవుతారు. సంతోషం  తగ్గుతుంది. ప్రతికూల వార్తలు వినే అవకాశం ఉంది. పని ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.  అనవసర ఖర్చులు ఆపడానికి ప్రయత్నిస్తారు. మీ ప్రేమికుడి భావాల గురించి ఆందోళన ఉంటుంది.


Also Read: మీ స్నేహితులు, సన్నిహితులకు వినాయకచవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!


కర్కాటక రాశి


ఈ రాశివారు ఈ రోజు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మనసులో సానుకూల ఆలోచనలు ఉంటాయి. వ్యాపారంలో పెద్ద డీల్ ఉండవచ్చు.  ప్రయాణాలకు అవకాశం ఉంది. ఎక్కువ సమయం స్నేహితులతో చర్చల్లో గడిపేస్తారు.


సింహ రాశి


ఈ రాశివారు అధిక ఒత్తిడికి గురికావచ్చు.  ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆర్థికంగా బలపడతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. ఎదుటివారు బాధపడే పదాలు వినియోగించవద్దు.  డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.


కన్యా రాశి 


ఈ రాశివారికి ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఎవరి పనుల్లోనూ జోక్యం చేసుకోకండి. తప్పుడు పనులు చేయవద్దు. ఈ రాశి ఉద్యోగులు సీనియర్ల నుంచి మార్గ దర్శకత్వం పొందుతారు. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మనసు ఆనందంతో నిండిపోతుంది.


Also Read: వినాయకుడికి పత్రి పూజ - మరే దేవుడికీ లేదెందుకు!


తులా రాశి 


ఈ రాశివారు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పని చేయండి. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఎదుటి వ్యక్తుల మాటలు విని ఆవేశపడొద్దు. స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండడం మంచిది. తొందరపడి ఏ పనీ చేయవద్దు.  ఉంటుంది.  చెడు సాంగత్యం వల్ల సమస్యలు ఉంటాయి.


వృశ్చిక రాశి 


ఈ రోజు ఈ రాశివారికి ఉన్న కొన్ని చింతలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తుల సమస్యలు పరిష్కరమవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. మీ మనసులో ప్రేమను చెప్పేందుకు ఇదే మంచి సమయం. ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. 


ధనుస్సు రాశి 


ఈ రాశివారు ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. వ్యాపారంలో స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది.  మీ ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు ప్రేమ సంబంధాలకు చాలా సమయం ఇస్తారు. 


మకర రాశి 


ఈ రాశివారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద సూచనలున్నాయి అప్రమత్తంగా వ్యవహరించాలి. కత్త ప్రణాళికలు ఇప్పట్లో అమలు చేయకపోవడమే మంచిది. అప్పులు తీసుకోవద్దు. చెడు సహవాసం వల్ల మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


Also Read: వినాయక పూజ చేయడమే కాదు - ఆ రూపం నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసా!


కుంభ రాశి 


కుంభ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరంగా కోపం ప్రదర్శించవద్దు. ఎవ్వరిపైనా మాట తూలొద్దు. ఇంటి పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన విరమించుకోవాలి. విద్యార్థులకు బాగానే ఉంటుంది.
 
మీన రాశి


ఈ రాశివారు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాల్సిన  సమయం ఇది. ఈ రోజు బావుంటుంది. సాహిత్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.