Varuthini Ekadashi 2025 : తిథుల్లో ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిలు దేనికదే ప్రత్యేకం. వైశాఖ మాసంలో అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని వరూథిని ఏకాదశి అంటారు. వరూథిని ఏకాదశినే బరుతాని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది అంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 24 గురువారం వరూథిని ఏకాదశి వచ్చింది. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి? దీనివెనుకున్న పురాణకథ ఇక్కడ తెలుసుకోండి
వరూథిని ఏకాదశి తిథి
ఏకాదశి తిథి ఏప్రిల్ 23 బుధవారం ఉదయం 11.50 నుంచి ప్రారంభమైంది..సూర్యోదయానికి ఏకాదశి తిథి లేదు... ఏప్రిల్ 24 గురువారం ఉదయం 10.51 వరకూ ఉంది. అందుకే వరూధిని ఏకాధశి ఏప్రిల్ 24నే పాటించాలి. ఏప్రిల్ 23 రాత్రి నుంచి నియమాలు పాటించాలి. ఏప్రిల్ 24 మొత్తం ఉపవాసం ఉండి ఏప్రిల్ 25 శుక్రవారం ద్వాదశి రోజు దానం ఇచ్చిన తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ రోజు శ్రీ మహావిష్ణువుతో పాటూ లక్ష్మీదేవి, తులసిని కూడా పూజించాలి.
వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత
వరూథిని ఏకాదశి వ్రతాన్ని ఆచరింస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు పండితులు. బ్రహ్మపై కోపంతో ఐతో తల ఖండించాడట శివుడు. ఆ శాపం నుంచి విముక్తి కోసం వరూథిని ఏకాదశి ఉపవాసం పాటించాడని పురాణ కథనం. సూర్యగ్రహణం సమయంలో బంగారం దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో వరూథిని ఏకాదశి వ్రతం చేయడం అంతే ఫలితం కలుగుతుందని పురాణాల్లో ఉంది.
ఉపవాసాన్ని విరమించే ముందు పండితుల ఆశీర్వచనం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. ఈ రోజు నువ్వులు దానం చేస్తారు. వరూథిని ఏకాదశి రోజు బంగారం కన్నా నువ్వుల దానం మరింత మంచిదంటారు. వేసవి కాలం ఎండలు మండే రోజులు కావడంతో ఈ రోజు ఆహారం, నీరు అందరకీ అందించాలి. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పేదలకు అన్నదానం చేయడం శుభఫలితాన్నిస్తుంది. 15 రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి రోజు చేసే ఉపవాసం మనసు, శరీరంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు కఠిన ఉపవాసాలు కాకుండా పండ్లు, పాలు తీసుకోవచ్చు.
వరూథిని ఏకాదశి రోజు కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహా విష్ణువు అవతారం అయిన వామనమూర్తిని పూజిస్తారు, ఇంకొందరు కృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజు మధురాష్టకం పఠిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, ఐశ్వర్యం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. పీకల్లోతు కష్టాల్లో ఉండేవారు గజేంద్రమోక్షం పఠిస్తారు. భక్తి, ముక్తికోసం ప్రయత్నించేవారు విష్ణుసహస్రనామం పఠిస్తారు. వరూథిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మాంగల్యబలం పెరుగుతుంది. పురుషులకు సిరిసంపదలు వస్తాయి. ఏళ్లతరబడి తపస్సు చేస్తే లభించే ఫలితం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలుగుతుందని భవిష్యపురాణంలో ఉంది. రావణుడిని ఓడించిన మాంధాత ఈ వ్రతాన్ని ఆచరించి స్వర్గానికి వెళ్లాడని ధర్మరాజుకి వివరించాడు శ్రీ కృష్ణుడు.
ఓం నమో నారాయణాయ
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి