Sunday Special: కొందరికి కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. మరికొందరికి ఎప్పుడో ఓసారి కష్టం వచ్చి బాధపెడుతుంది. ఇంకొందర్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం ఉండనే ఉండదు. అయితే భగవంతుడిపై విశ్వాసం ఉండేవారంతా కష్టకాలంలో దేవుడిని ప్రార్థిస్తారు. ఆ కష్టాల నుంచి గట్టెక్కించమని ప్రార్థిస్తారు. ఇందుకోసం సూచించినవే పరిహారాలు. భక్తి విశ్వాసాలతో వీటిని అనుసరిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. మనసునిండా నిండిపోయిన నెగెటివ్ ఆలోచనల నుంచి సానుకూల ఆలోచనలవైపు దృష్టి మరలుతుంది. ఈ విషయంలో ప్రతి రోజుకీ ప్రత్యేకత ఉన్నప్పటికీ ఆదివారం అన్నిటికన్నా అత్యంత ముఖ్యం అని నమ్ముతారు. సూర్యభగవానుడికి ప్రీతకరమైన ఆదివారం కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా కష్టాల నుంచి గట్టెక్కవచ్చంటారు. 

ఆదివారం రోజు వేకువజామునే నిద్రలేచి స్నానం ఆచరించి తూర్పువైపు తిరిగి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.  అర్ఘ్యాన్ని ఇంటిబయట అయినా ఇవ్వొచ్చు కుదిరితే నదుల సమీపంలో , సముద్ర ప్రాంతంలో , నీరు ప్రవహించే ప్రదేశాల్లో సమర్పించవచ్చు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు  "ఓం సూర్యాయ నమః , ఓం వాసుదేవాయ నమః , ఓం ఆదిత్యాయ నమః" అనే మంత్రాలు జపించడం మంచిది

ఆదివారం రోజు చేసే దానాలు విశేష ఫలితాలన్నిస్తాయి. ఈ రోజు  బెల్లం, పాలు, బియ్యం, ఎరుపు రంగు వస్త్రాలు, రాగి పాత్రలు దానం ఇవ్వడం వల్ల జాతకంలో ఉండే గ్రహదోషాలు తొలగిపోతాయి. ఆరోగ్యం, ఆనందం, ఉద్యోగం, వ్యాపారం, ఐశ్వర్యం అన్నింటికీ గ్రహసంచారమే కారణం అని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అందుకే దానధర్మాలు చేయడం వల్ల గ్రహసంచారంలో ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయంటారు

నిత్యం దీపారాధన చేయడం మంచిది..కనీసం అన్ని రోజులు కుదరకపోతే ఆదివారం రోజు అయినా దీపారాధనకు సమయం కేటాయించండి. ఈ రోజు దేవుడి మందిరంతో పాటూ ఇంటి ప్రదాన ద్వారం వద్ద నేతితో దీపం వెలిగిస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. 

ఆదివారం రోజు పూజ అనంతరం చందనాన్ని నుదుటన పెట్టుకోండి. ఆదిత్యుడికి అర్పించిన ఎర్ర చందనం  బొట్టుగా పెట్టుకుంటే ప్రతికూల శక్తులు తొలగిపోయి..మీరు అన్నింటా విజయం వరిస్తుందని చెబుతారు. చందనాన్ని నుదుటిపై ధరిస్తే జ్ఞానచక్రం చైతన్యవంతమై పాజిటివ్ ఆలోచనలు పెంచుతుంది

ఆదివారం రోజు ఎరుపురంగు వస్త్రాలు దానం చేయడమే కాదు..ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం కూడా శుభప్రదం అని చెబుతారు పండితులు

 సూర్యాష్టకం

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కరదివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజంశ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహంమహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరంమహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవ చప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్పసంకాశం హార కుండల భూషితంఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహాతేజః ప్రదీపనంమహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదంమహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనంఅపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినేసప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినేన వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం