If You Get Periods in a Temple: కొన్ని దీక్షలు 40 రోజులు చేయాల్సినవి వస్తాయి.. మరికొన్ని దీక్షలు వారం, పక్షం రోజులు చేయాల్సినవి ఉంటాయి. మీరు చేసే దీక్ష ఆధారంగా మీరు ప్రారంభించే రోజును ప్లాన్ చేసుకోవాలి. 

40 రోజుల పాటు పారాయణం, దీక్ష చేయాల్సి ఉన్నప్పుడు తప్పనిసరిగా నెల రోజుల్లో రుతుక్రమం వస్తుంది. మరి లెక్క తప్పుతుంది కదా ఏం చేయాలి అనే సందేహం వస్తుంది. అయితే 40 రోజల పాటూ చేసే పారాయణం, దీక్షల సమయంలో పీరియడ్స్ వస్తే ఆ రోజుతో పారాయణం ఆపేసి.. తిరిగి ఐదోరోజు స్నానం ఆచరించినప్పటి నుంచి కంటిన్యూ చేయవచ్చు. లెక్క మళ్లీ మొదటి నుంచి రావాల్సిన అవసరం లేదు. 

సప్తాహ పారాయణం అని కొందరు చేస్తుంటారు. ఇలాంటప్పుడు మీకు ఇబ్బంది అయిపోయిన వెంటనే ప్రారంభిస్తే మళ్లీ పీరియడ్స్ వచ్చేలోగా మీ దీక్ష, పారాయణం పూర్తవుతుంది. ఇలా సప్తాహం చేసే రోజుల్లో డేట్ వస్తే మాత్రం ఐదు రోజుల స్నానం అనంతరం మళ్లీ మొదట్నుంచి చేయాల్సిందే

సత్యనారాయణ స్వామి వ్రతం, నోములు, ప్రత్యేక పూజల్లో ఉన్న సమయంలో పీరియడ్స్ వస్తే మాత్రం మీకు సందేహం వచ్చిన క్షణమే అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడం మంచిది. పూజ/వ్రతం మధ్యలో ఉన్నప్పుడు లేచి వెళ్లిపోతే పాపం ఏమో అని ఆలోచించి కొనసాగించడం ఇంకా పాపం. అయితే ఆ పూజని అక్కడితో ఆపేయాల్సిన అవసరం లేదు. మీ జీవిత భాగస్వామి కొనసాగించవచ్చు.

పీరియడ్స్ సమయంలో స్తోత్రాలు చదవకూడదు, పారాయణం చేయకూడదు 

ఇక ఆలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు డేట్ వస్తే ఏంటి పరిస్థితి అనే సందేహం ఉంటుంది. ఏదైనా క్షేత్రంలో ఉన్నప్పుడు డేట్ వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆలయంలోకి ప్రవేశించకూడదు. రూమ్ లోనే ఉండిపోవాలి. కొన్నిసార్లు ఆలయంలో ప్రవేశించిన తర్వాత క్యూ లైన్ల మధ్యలో ఉండగా పీరియడ్స్ వస్తే ..అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. అయితే తిరుమల లాంటి ఆలయాలకు వెళ్లినప్పుడు క్యూలైన్లలోకి ఒక్కసారి వెళ్లిన తర్వాత వెనక్కు తిరిగి రాలేం.. పరిస్థితి మనచేతిలో లేనప్పుడు భగవంతుడా క్షమించు అనుకుని ముందుకు సాగిపోవాల్సిందే. 

తెలియకుండా జరిగే తప్పుని దేవుడు క్షమిస్తాడు..కానీ తెలిసి చేసిన తప్పుని దేవుడు క్షమిస్తాడా అనే సందేహాలు కూడా వస్తాయ్?దీనికి సమాధానం లక్షవత్తుల నోము అని పండితులు చెబుతారు. వివాహితులు చేసే చాలా నోముల్లో ఒకటి లక్షవత్తుల నోము. ఈ నోముని ఒక్కరోజులో పూర్తిచేసేస్తారు. రాత్రంతా కూర్చుని లక్షవత్తులు వెలిగిస్తారు..చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ నోము పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత చేస్తారు. ఈ ఒక్క నోము చేయడం వల్ల తెలిసి, తెలియకుండా చేసిన పాపాలు తొలగిపోతాయి, భ్రూణహత్య లాంట దోషాలను కూడా ఈ నోము తొలగిస్తుందని చెబుతారు. 

తిరుమల లాంటి క్షేత్రానికి టికెట్లు బుక్ చేసుకుంటారు...ఆ సమయంలో పీరియడ్స్ వస్తే? ఇంట్లో చెబితే ఏమంటారో అనే భయంతో చెప్పకుండా ఆగిపోతారు. కొన్నిసార్లు ఇంట్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో డేట్ వచ్చినప్పుడు కూడా చెప్పేందుకు సందేహిస్తారు. గొడవ చేస్తారేమో, తిడతారేమో అని ఆగిపోతారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆమెకు కుటుంబంలో సహకారం ఉండాల్సిందే. ఇలాంటి వాతావరణం లేనప్పుడు ఆమె చేసే పాపం ఇంటిల్లిపాదిని చుట్టుకుంటుంది.  జీవిత భాగస్వామికి పీరియడ్స్ వస్తే ఆమెను తాకకుండా, ఆమె పెట్టిన భోజనం తినకుండా ఉన్నట్టైతే మీరు ఆలయానికి వెళ్లిరావొచ్చు.  ముఖ్య గమనిక: పీరియడ్స్ లో పాటించాల్సిన నియమాల గురించి ఏదైనా చర్చ ప్రారంభించగానే స్త్రీవాదులంతా భిన్నమైన వాదనలు వినిపిస్తుంటారు. ఇది ప్రకృతి సహజం, ఈ పేరుతో స్త్రీలను అవమానించవద్దంటూ వాదిస్తారు. ఇదే మీ ఆలోచన అయితే ఈ కథనం మీకోసం కాదు. ఎలాంటి పట్టింపులు లేనప్పుడు మీరు ఇవేమీ పాటించాల్సిన అవసరం లేదు. నిత్యం పూజ, ఉపాసన చేసేవారి ,సంప్రదాయాన్ని పాటించేవారి కోసంమే ఈ సలహాలు సూచనలు. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి