PM Modi : జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని సంచలనం సృష్టించింది. చాలా ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ స్థాయిలో ఉగ్రదాడి జరిగింది. దీంతో సౌదీ అరేబియా అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్న మోదీ తన పర్యటనను అర్థాంతరంగా ముగించేశారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పశ్చిమాసియాలో టూర్ రద్దు చేసుకొని భారత్‌కు తిరిగి పయనమయ్యారు.
మంగళవారం భారతదేశానికి తిరిగి బయలుదేరి ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటారని పిటిఐ వర్గాలు తెలిపాయి. జెడ్డాలో సౌదీ అరేబియా నిర్వహించే అధికారిక విందుకు ప్రధాని మోదీ దూరంగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను కూడా కలవాల్సి ఉంది. అన్నింటినీ రద్దు చేశారు.
సౌదీ అరేబియా అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్న మోదీ తన పర్యటనను అర్థాంతరంగా ముగించేశారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పశ్చిమాసియాలో టూర్ రద్దు చేసుకొని భారత్‌కు తిరిగి పయనమయ్యారు.
మంగళవారం భారతదేశానికి తిరిగి బయలుదేరి ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటారని పిటిఐ వర్గాలు తెలిపాయి. జెడ్డాలో సౌదీ అరేబియా నిర్వహించే అధికారిక విందుకు ప్రధాని మోదీ దూరంగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను కూడా కలవాల్సి ఉంది. అన్నింటినీ రద్దు చేశారు.
జెడ్డాలో ఉంటున్న టైంలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి ప్రధానమంత్రి తెలుసుకున్నారు. వెంటనే అమిత్‌షాకు ఫోన్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే జమ్ముకశ్మీర్ వెళ్లి పరిస్థితి నేరుగా సమీక్షించాలని పేర్కొన్నారు. హైలెవల్ కమిటీ మీటింగ్ నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా జమ్ముకశ్మీర్‌వెళ్లారు.
దాడి గురించి తెలుసుకున్న మోదీ... ఉగ్రచర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ దారుణమైన చర్య వెనుక ఉన్న వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. Xలో ఒక పోస్ట్ పెట్టిన ప్రధానమంత్రి ఇలా అన్నారు.... “జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అయిన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు సాధ్యమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ”
ఈ దాడికి పాల్పడిన వారికి తీవ్ర హెచ్చరిక చేశారు ప్రధానమంత్రి మోడీ "ఈ హేయమైన చర్య వెనుక ఉన్నవారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. వారిని వదిలిపెట్టబోము! వారి విధ్వంసం ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం మరింత బలపడుతుంది." అని నొక్కి చెప్పారు.