తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 21 నుంచి దోస్త్‌ 'స్పెషల్ రౌండ్' కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి శనివారం(సెప్టెంబర్‌ 16) షెడ్యూలును విడుదల చేశారు. ఇప్పటికే ఆయా కళాశాలల్లో చేరిన వారు అదే కళాశాలలో మరో కోర్సులోకి మారేందుకు ఇంట్రా కాలేజీ రెండో విడతకు కూడా అనుమతి ఇచ్చారు. 
విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 19 నుంచి 20 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి సెప్టెంబర్‌ 21న సీట్లను కేటాయించనున్నారు.  


స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ రిజిస్ట్రేషన్‌: సెప్టెంబర్‌ 21 నుంచి 24 వరకు
➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: సెప్టెంబర్‌ 21 నుంచి 25 వరకు
➥ సీట్ల కేటాయింపు: సెప్టెంబర్‌ 29న
➥ ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్, కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్‌: సెప్టెంబర్‌ 29, 30 తేదీల్లో


స్పాట్‌ ప్రవేశాలు..


దోస్త్ పరిధిలోని ఆయా కళాశాలలు అక్టోబరు 3, 4 తేదీల్లో స్పాట్‌ ప్రవేశాలు జరుపుకోవచ్చని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 


రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సులకు సంబంధించి మొత్తం 4,73,214 సీట్లు ప్రతీ ఏటా ఉండేవి. అయితే ప్రతీ ఏడాది 2 లక్షల నుంచి 2.50 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు, మరికొన్ని కాలేజీల్లో 15 శాతం లోపే ప్రవేశాలు జరిగేవి. దీంతో కాలేజీలు కోర్సులను నడపలేకపోతున్న నేపథ్యంలో హేతుబద్ధీకరణ చేపట్టి 86,670 సీట్లను గతేడాదిలోనే ఫ్రీజ్‌ చేశారు. 


'దోస్త్' నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


CPGET: సీపీగెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇలా
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కామన్ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్) కౌన్సెలింగ్ షెడ్యూల్ పూర్తిగా మారింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను కన్వీనర్ ఆచార్య ఎల్.పాండురంగారెడ్డి శుక్రవారం (సెప్టెంబరు 15న) విడుదల చేశారు. సీపీగెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 5న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మొదట రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబరు 15గా నిర్ణయించగా... తాజాగా ఆ గడువును సెప్టెంబరు 22 వరకు పొడిగించారు. మహాత్మాగాంధీ, కాకతీయ వర్సిటీల బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల ఫలితాలు ఇంకా వెలువడకపోవడంతో ఈ మార్పు చేసినట్లు తెలిసింది. శుక్రవారం వరకు మొత్తం 30 వేల మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


అంబేడ్కర్ 'దూరవిద్య' డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన ప్రవేశ గడువును పెంచిన యూనివర్సిటీ మరోసారి 15 రోజులపాటు పొడిగించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...