Top 10 Headlines Today: 


ఇస్రో వైపు ప్రపంచ చూపు


ఇస్రోకే కాదు దేశ చరిత్రలోనే బిగ్‌డే. ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చంద్రయాన్-3 జాబిలిని ముద్దాడేందుకు సిద్ధమైంది. ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగం దేశ ప్రజలకే యావత్‌ ప్రపంచం ఎంతగానో ఆసక్తిగా గమనిస్తోంది. ఎల్‌వీఎం3-ఎం4 ద్వారా ఈ ప్రయోగం మధ్యాహ్నం 2.35కి జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


చందమామ కథలు


భూమికి సహజ ఉపగ్రహంలా ఓ నిర్దిష్ట కక్ష్యలో భూమి చుట్టూ తిరుగతూ భూమిపై సముద్రంలో అలలు ఏర్పడటానికి, వాతావరణాన్ని ప్రభావితం చేయటానికి కారణమౌతుంది చందమామ. మరి అలాంటి చందమామ పై ప్రయోగాలు ఎప్పటి నుంచో మొదలయ్యాయో తెలుసా? ఈ నెల 13న మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చంద్రుడిపైకి చేస్తున్న ఈ టైమ్ లో చంద్రుడి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, చంద్రయాన్ మిషన్ ఉద్దేశాలు వరుస కథనాల రూపంలో ఏబీపీ దేశం మీకు అందిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కాపు ఓట్లపై పార్టీల గురి


ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి జనసేన పార్టీ నిద్ర లేకుండా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాపు సామాజికవర్గం పూర్తిగా దూరమైతే.. గెలుపుపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న వైఎస్ఆర్‌సీపీ పవన్ కల్యాణ్ దూకుడుతో టెన్షన్ పడుతోంది.దీంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంబటి రాయుడు వంటి వారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా... పెద్దగా వర్కవుట్ అవడం లేదు. అవి ఎంత వరకు ఉపయోగపడినా.. కనీసం కాపు ఓట్లలో చీలిక తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పరంగా వైఎస్ఆర్‌సీపీ కొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాపు ల్లో బాగంగా చెప్పుకునే  తూర్పుకాపు, శెట్టిబలిజ వంటి కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రిజర్వుడు నియోజకవర్గాలపై ఫోకస్


తెలంగాణ బీజేపీ ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా .. ముందుకే వెళ్లాలని అనుకుంటోంది. వ్యూహాత్మకంగా రిజర్వుడు నియోజకవర్గాలపై ఇప్పటికే దృష్టి పెట్టారు. ఆర్థికంగా బలమైన నేతల్ని ఇంచార్జులుగా పెట్టి విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పాగా వేయడం ద్వారా  అధికారం చేజిక్కించుకోవచ్చని భావిస్తున్నారు.  తెలంగాణలో  31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణలో అధికారానికి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపు దగ్గరిదారి అని బీజేపీ హైకమాండ్ ఓ బ్లూప్రింట్ రెడీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం 


నిన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీద 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ఆవర్తనం ఈ రోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే నిన్నటి ఆవర్తనం ఈ రోజు కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  సగటు సముద్రమట్టం నుండి 4.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌‌ వాయిదా


2019 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు నిర్వహించాల్సిన నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌‌ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ గురువారం (జులై 13న) ప్రకటించింది. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నెక్ట్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌ఎంసీ తెలిపింది. అయితే జులై 28న నిర్వహించాల్సిన మాక్‌ నెక్స్ట్‌ పరీక్ష నిర్వహణపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జాగ్రత్తగా వాడుకోండి


టమాట కష్టాలు ఇప్పుడప్పుడే వదిలేలా లేవు! కిలో రూ.150కి చేరుకుంటేనే ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అలాంటిది రాబోయే రోజుల్లో కిలో రూ.300కు చేరుకుంటుందని వ్యవసాయ శాఖా నిపుణులు అంచనా వేస్తున్నారు. అనువైన వాతావరణం లేకపోవడం, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఇందుకు కారణాలని పేర్కొంటున్నారు. వారి మాటలు వింటుంటేనే వినియోగదారులు వణికిపోతున్నారు! పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జైస్వాల్‌ సూపర్ హిట్


భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న డొమినికా టెస్టులో రెండో రోజు కూడా భారత ఆధిపత్యం కొనసాగింది. తొలి రోజు 150 పరుగులకే ఆలౌటైన విండీస్ జట్టుపై భారత్‌ భారీ స్కోర్ నమోదు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో రోజు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. తొలి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్143 పరుగులతో, విరాట్ కోహ్లీ 36 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హాలీవుడ్ లో సమ్మె సైరన్


హాలీవుడ్ లో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీసుల నుంచి మంచి లాభాలు ఆర్జించే నిర్మాణ సంస్థలు.. తమకు కనీస వేతనం ఇవ్వట్లేదని ఆరోపిసస్తూ రైటర్స్ గిల్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా హాలీవుడ్ లో ఏ ఒక్క రైటర్ కూడా పని చెయ్యట్లేదు. వీరి సమ్మెకు కొన్ని యూనియన్లు, పలువురు ప్రముఖులు మద్దతు పలికాయి. అయితే ఇప్పుడు హాలీవుడ్ నటీనటులు సైతం రైటర్ స్ట్రైక్ లో చేరాలని నిర్ణయించున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బేబీ సినిమా ఎలా ఉంది


ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ మరో హీరో. ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ Baby సినిమా ఎలా ఉందంటే?పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి