ఇస్రోకే కాదు దేశ చరిత్రలోనే బిగ్‌డే. ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చంద్రయాన్-3 జాబిలిని ముద్దాడేందుకు సిద్ధమైంది. ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగం దేశ ప్రజలకే యావత్‌ ప్రపంచం ఎంతగానో ఆసక్తిగా గమనిస్తోంది. ఎల్‌వీఎం3-ఎం4 ద్వారా ఈ ప్రయోగం మధ్యాహ్నం 2.35కి జరగనుంది. 


ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఈ ప్రయోగానికి గురువారం కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. తొలిసారిగా చంద్రుడికి ఆవల వైపు ల్యాండర్‌, రోవర్‌లను పంపనున్నారు. అందుకే యావత్ ప్రపంచం ఇస్రో ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. మంచి ఉత్సాహం మీద ఉన్న ఇస్రో మాత్రం కచ్చితంగా ఈ ప్రయోగం విజయం సాధిస్తుందన్న నమ్మతం ఉంది.  2019 జులై15 చంద్రయాన్‌-2 ప్రయోగం చేసి ఇస్రో విపలమైంది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు. 


చంద్రుని వద్ద ఉన్న మరిన్ని రహస్యాలను ఛేదించేందుకే ఈ ప్రయానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. చంద్రయాన్-3లో ప్రొపల్షన్ మాడ్యూల్‌ 2,145 కిలోలు, ల్యాండర్‌ 1,749 కిలోలు, రోవర్‌ 26 కిలోలు ఉంటాయి. టోటల్‌గా దీని బరువు 3,920గా చెబుతున్నారు. ఈసారి కేవలం ఆరు పేలోడ్స్‌ను మాత్రమే పంపుతున్నారు. ఇందులో ఒక ఇస్రో పేలోడ్‌ ఉంది. 
చాలా దేశాలు చంద్రునిపై పరిశోధనలు చేశారు కానీ ఎవరూ దక్షిణ ధ్రవం వైపు వెళ్లలేదు. ఇస్రో మాత్రం దక్షిణ ధ్రువంవైపు ఫోకస్ పెట్టింది. అందుకే చంద్రయాన్ -1 ను ప్రయోగించింది. ఇప్పుడు చంద్రయాన్‌-3ని కూడా అక్కడేకే పంపిస్తోంది. చంద్రయాన్‌–3 ల్యాండర్‌ను చంద్రుని చీకటి ప్రాంతంలో దించనున్నారు. 
మిషన్ లక్ష్యాలేంటి..?
1. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్ అయ్యేలా చేయడం
2. రోవర్‌ సరైన విధంగా చంద్రుడిపై తిరిగేలా చేయడం
3.సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్‌ 


చంద్రుడిపై సన్‌రైజ్‌ ఎలా ఉందన్న దానిపైనే ల్యాండింగ్ ఎప్పుడవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. సన్‌రైజ్‌లో ఆలస్యం జరిగితే.. ల్యాండింగ్‌ కూడా లేట్ అవుతుంది. అదే జరిగితే...ఇస్రో ల్యాండింగ్‌ని సెప్టెంబర్‌కి రీషెడ్యూల్ చేస్తుంది. కానీ...ఈ మిషన్‌లో అసలైన క్రూషియల్ పాయింట్ ఇదే. ల్యాండింగ్‌కి కనీసం 15 నిముషాల సమయం పడుతుంది. అందుకే...ఇస్రో మాజీ ఛైర్‌పర్సన్ కే శివన్ "15 మినిట్స్ ఆఫ్ టెర్రర్" అని డిఫైన్ చేశారు. ఒక్కసారి సేఫ్‌గా ల్యాండ్ అయిన తరవాత ల్యాండర్ (Vikram) నాలుగు సైంటిఫిక్ పేలోడ్స్‌ని ( scientific payloads) చంద్రుడి ఉపరితలంపై డిప్లాయ్ చేస్తుంది.  అవే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులను స్టడీ చేస్తాయి. ఈ మాడ్యూల్‌లో Spectro-polarimetry of HAbitable Planet Earth (SHAPE) పరికరం అమర్చి ఉంటుంది. భూమి ఎంత కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది..? ఎంత ఎమిట్ చేస్తోంది..? అనే డేటాని ఈ పరికరం సేకరిస్తుంది. ఇక రోవర్ ప్రగ్యాన్ (Pragyan Rover) కెమికల్ టెస్ట్‌ల ద్వారా లూనార్ సర్‌ఫేస్‌పై పరిశోధనలు చేపడుతుంది. 
2019 సెప్టెంబర్‌లో చంద్రయాన్ 2 (Chandrayaan 2) ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. అయితే...ఆన్‌బోర్డ్ కంప్యూటర్‌, ప్రపల్షన్ సిస్టమ్‌లలో లోపాల కారణంగా అది సాఫ్ట్‌ ల్యాండింగ్ అవ్వలేదు. చంద్రుడి ఉపరితలంపై అది క్రాష్ అయింది. ఆ ప్రాజెక్ట్‌లో తలెత్తిన సమస్యల్ని గుర్తించిన సైంటిస్ట్‌లు ఆ సవాళ్లను అధిగమించేలా చంద్రయాన్ 3ని తెరపైకి తీసుకొచ్చారు. సేఫ్‌ ల్యాండింగ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 
చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడం వల్ల చంద్రయాన్ 3ని ఛాలెంజ్‌గా తీసుకుంది ఇస్రో. ఈ సారి కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు సైంటిస్ట్‌లు. ఈ క్రమంలోనే తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావాలని వెంకన్న స్వామిని కోరుకున్నారు. చంద్రయాన్‌ 3కి సంబంధించిన మినియేచర్ మోడల్‌ని తమతో పాటు తీసుకొచ్చారు. వెంకన్న సన్నిధిలో ఉంచి ప్రార్థనలు చేశారు. మొత్తం 8 మంది సైంటిస్ట్‌లు తిరుపతి బాలాజీని సందర్శించుకున్నారు. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శ్రీ చెంగలమ్మ ఆలయం వద్ద ప్రార్థనలు చేశారు. అనుకున్నట్టుగా ఈ మిషన్ సక్కెస్ అవ్వాలని, చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలని కోరుకున్నారు. గతంలో నిర్వహించిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది. దీంతో చంద్రయాన్ -3 ని ఫెయిల్యూర్ బేస్ట్ అప్రోచ్ తో అభివృద్ధి చేశామని సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్-2 ను సక్సెస్ బేస్డ్ మోడల్ లో రూపొందించారు.