Top 10 Headlines Today:


పవన్ వస్తున్నాట్టా? రానట్టా?


జనసేన అధినేత పవన్ కల్యాణ్  తెలంగాణ ఎన్నికల ( Telangana Elections )  ప్రచార బరిలోకి ఇంకా దిగలేదు. బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీతో పాటు హాజరయ్యారు కానీ అక్కడ ఆయన  ప్రసంగం మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్న కోణంలో సాగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయలేదు. అదే సమయంలో ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించ లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఎన్నికల ప్రచారం చేస్తారో లేదో కూడా స్పష్టత లేదు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కులాల లెక్కలు తప్పుతాయా?


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్,  బీఆర్ఎస్ ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలతో పోలిస్తే భిన్నత్వం కనిపిస్తోంది. కాంగ్రెస్,  బీఆర్ఎస్ ( BRS  )  ఫలానా వర్గాన్ని దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు. తాము అందరి కోసం ఆలోచిస్తామన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం బిన్నంగా వెళ్తోంది.  బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించింది. పవన్ కల్యాణ్‌తో పొత్తులు పెట్టుకుంది. ఈ వ్యూహాలతో బీజేపీ ఎంత ప్లస్ అవుతుందో కానీ.. బీజేపీ ఓటు బ్యాంక్ గా ( Vote Bank ) ఉన్న కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం మాత్రం రాజకీయ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బాలరాజుపై మరో దాడి


అచ్చంపేట ఎమ్మెల్యే (Achampet MLA), బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వలబాలరాజు (MLA Guvvala Balaraju)పై వరుస దాడులు  జరుగుతున్నాయి. నిన్న రాత్రి మరోసారి బాలరాజుపై దాడి జరిగింది. నిన్న రాత్రి... నాగర్‌కర్నూలు జిల్లా(Nagarkurnool District) అమ్రాబాద్ మండలం కుమ్మరోళ్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో 


ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో  (  Joint manifesto ) విషయంలో కీలక ముందడుగు వేశాయి.  తెలుగుదేశం-జనసేన కలిపి 11 అంశాలతో మినీ మేనిఫెస్టోపై ఓ అంచనాకు వచ్చారు.  తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో పథకాలను ప్రకటించింది.  వీటికి తోడు జనసేన ప్రతిపాదించిన 5 అంశాలకు అంగీకారం తెలిపారు. జనసేన ప్రతిపాదించినట్లుగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు 10లక్షల వరకు సబ్సిడీ ,  ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని యనమల రామకృష్ణుడు  ( Yaamala  ) తెలిపారు.  అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కాంగ్రెస్‌కు షాక్


 ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మీడియాలో కాంగ్రెస్ ప్రచార ప్రకటనలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ప్రకటనలపై బ్యాన్ విధించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఓటమి భయం పట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఒత్తిడితోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం


టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్‌, డ్యాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ డ్యాషింగ్‌ ఓపెనర్‌... ఇప్పుడు ICC నుంచి అత్యున్నత గౌరవం అందుకున్నాడు. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు చోటు దక్కింది. సెహ్వాగ్‌తో పాటు భారత మహిళా క్రికెటర్‌ డయానా ఎడుల్జీకి కూడా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది. వీరితో పాటు శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వా కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. వీరి ముగ్గురినీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో చేర్చుతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్ నుంచి 9 మంది క్రికెటర్లకు ఇప్పటి వరకూ స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హిస్టరీ రిపీట్ అవుతుందా?


ఏప్రిల్ 2, 2011 భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. కోట్లాది మంది అభిమానుల కల నెరవేస్తూ.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ... ధోనీ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. 2011లో ప్రపంచకప్‌ను  టీమ్‌ఇండియా రెండోసారి ముద్దాడిన ఆ క్షణాలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రను వేశాయి. ఇండియన్ క్రికెట్ దశ, దిశను మార్చిన ప్రపంచకప్‌ అది. 1975 నుంచి 2019 వరకు పన్నెండు సార్లు వరల్డ్ కప్ జరగగా భారత్ జట్టు రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచింది. 1983లో కపిల్‌దేవ్ కెప్టెన్సీలో, 2011లో ఎం.ఎస్. ధోనీ సారథ్యంలో భారత్ జట్టు విజేతగా నిలిచింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మృణాల్ ఠాకూర్ దీపావళి పార్టీ


'సీతా రామం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్. డిసెంబర్ 7న విడుదల కానున్న 'హాయ్ నాన్న' సినిమాలోనూ కథానాయికగా నటించారు. విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'లోనూ నటిస్తున్నారు. రెండు రోజుల నుంచి హిందీ సినిమా ఇండస్ట్రీ, ప్రేక్షకులలో ఆమె ప్రేమ కహానీ గురించి చర్చ జరుగుతోంది. మృణాల్ ప్రేమలో పడ్డారని బీ టౌన్ టాక్. అందుకు కారణం శిల్పా శెట్టి దీపావళి పార్టీ! అసలు వివరాల్లోకి వెళితే... పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


'సలార్'లో పాటలు లేవా!


టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' (Salaar) మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'కేజిఎఫ్' (KGF) సిరీస్ ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మొదటిసారి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో ఆలస్యం చేసిన మూవీ యూనిట్ ఇక నుంచి సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ప్రభావం


ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి