TDP Janasena Menifesto : ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో ( Joint manifesto ) విషయంలో కీలక ముందడుగు వేశాయి. తెలుగుదేశం-జనసేన కలిపి 11 అంశాలతో మినీ మేనిఫెస్టోపై ఓ అంచనాకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో పథకాలను ప్రకటించింది. వీటికి తోడు జనసేన ప్రతిపాదించిన 5 అంశాలకు అంగీకారం తెలిపారు. జనసేన ప్రతిపాదించినట్లుగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు 10లక్షల వరకు సబ్సిడీ , ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని యనమల రామకృష్ణుడు ( Yaamala ) తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామన్నారు.
పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చామని యనమల వెల్లడించారు. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. వివిధ వర్గాలకు ఇప్పటివరకు లేని సమస్యలను జగన్ సృష్టించారని యనమల తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించే అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. తుది మేనిఫెస్టో విడుదల చేసే ముందు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చిస్తామని.. ఈ మీటింగ్ విశేషాలను పార్టీ అధినాయకత్వాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సౌభాగ్యపదం పేరుతో యువత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించిందనన్నారు.
సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్ తెలిపారు. అసమానతలు తొలిగి ఆర్ధిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు చేస్తున్నాం” అని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ”జనసేన వైపు నుంచి ఆరు ప్రతిపాదనలు పెట్టాం. యువతకు, మహిళలకు పవన్ కొన్ని హామీలిచ్చారు. అలాగే వివిధ వర్గాలకు వారాహి యాత్రలో పవన్ హామీలిచ్చారు. మేం ప్రతిపాదించిన కొన్ని అంశాలు టీడీపీ ప్రతిపాదించిన అంశాల్లోనూ ఉన్నాయని తెలిపారు.
మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నుంచి సభ్యులుగా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కమిటీలో ఉండగా....జనసేన పార్టీ నుంచి జనవాణి సమన్వయకర్త వర ప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సభ్యుడు ముత్తా శశిధర్, జనసేన అధికార ప్రతినిధి శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ కదిలించేలా మేనిఫెస్టోను రూపొందించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించాయి. మహిళలు, రైతులు, యువత, బీసీ, పేదలే టార్గెట్‌గా ఇరు పార్టీలు పలు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు టీడీపీ, జనసేన కూటమిపై మరింత నమ్మకం పెరిగేలా చేయాలని భావిస్తున్నాయి. అందుకోసమే కమిటీని ఏర్పాటు చేసి ఏయే అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలన్నదానిపై కూలంకశంగా చర్చించారు. తుది మేనిఫెస్టో ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది.