AP Assistant Professor Recruitment 2023: ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 49 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 20లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నవంబర్ 20న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటు దరఖాస్తు హార్డ్ కాపీలతో సెల్ఫ్ అటెస్టేషన్ చేయించిన డాక్యుమెంట్లను నవంబర్ 27లోపు నూజివీడులోని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌కు సమర్పించాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.2000 (ఓవర్సీస్ అభ్యర్థులకు రూ.4200), అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.3000 (ఓవర్సీస్ అభ్యర్థులకు రూ.8400) చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. వివరాలు.. * ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు: 49 పోస్టుల కేటాయింపు: ఎస్సీ-34, ఎస్టీ-15. ☛ అసిస్టెంట్ ప్రొఫెసర్: 31 పోస్టులు (ఎస్సీ-34, ఎస్టీ-15) ☛ అసోసియేట్ ప్రొఫెసర్: 18 పోస్టులు (ఎస్సీ-34, ఎస్టీ-15) విభాగాలవారీగా ఖాళీలు: కెమికల్ ఇంజినీరింగ్-02, కెమిస్ట్రీ-04, సివిల్ ఇంజినీరింగ్-05, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్-05, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-04, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-04, ఇంగ్లిష్-02, మేనేజ్‌మెంట్-02, మ్యాథమెటిక్స్-10, మెకానికల్ ఇంజినీరింగ్-04, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్-02, ఫిజిక్స్-04.
అర్హతలు..
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. యూజీసీ నెట్/స్లెట్/ఏపీసెట్ అర్హత ఉండాలి. (లేదా) బీఈ/బీటెక్/బీఎస్ డిగ్రీ (లేదా) ఎంఈ/ఎంటెక్ (లేదా) ఎంఎస్/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత గేట్/జీప్యాట్/సీడ్‌తోపాటు పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హులు.
➥ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీతోపాటు కనీసం 6 పబ్లికేషన్స్ ఉండాలి. టీచింగ్/రిసెర్చ్ విభాగంలో కనీసం 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు: అసిస్టెంట్ ప్రొఫెసర్- రూ.2000 (ఓవర్సీస్ అభ్యర్థులకు రూ.4200), అసోసియేట్ ప్రొఫెసర్-రూ.3000 (ఓవర్సీస్ అభ్యర్థులకు రూ.8400) దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచే ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు).
జీతం: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,31,400 - రూ.2,17,100; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.57,700 - రూ.1,82,400 చెల్లిస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:The RegistrarRajiv Gandhi University of Knowledge TechnologiesI-3 Administrative BuildingNuzvid Campus, Mylavaram Road,City: NuzvidDistrict: EluruAndhra Pradesh – Pin Code:521202.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023. (5 P.M.)
➥ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 27.11.2023. (5 P.M.)
ALSO READ:
➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
➥ టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 'కేంద్ర' కొలువులు - 1899 'పోస్టల్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
➥ బీఈఎంఎల్ లిమిటెడ్‌లో 101 ఎగ్జిక్యూటివ్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా