Mrunal Thakur Badshah Dating Rumours : 'సీతా రామం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్. డిసెంబర్ 7న విడుదల కానున్న 'హాయ్ నాన్న' సినిమాలోనూ కథానాయికగా నటించారు. విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'లోనూ నటిస్తున్నారు. రెండు రోజుల నుంచి హిందీ సినిమా ఇండస్ట్రీ, ప్రేక్షకులలో ఆమె ప్రేమ కహానీ గురించి చర్చ జరుగుతోంది. మృణాల్ ప్రేమలో పడ్డారని బీ టౌన్ టాక్. అందుకు కారణం శిల్పా శెట్టి దీపావళి పార్టీ! అసలు వివరాల్లోకి వెళితే...


దీపావళి సందర్భంగా శిల్పా శెట్టి తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దానికి మృణాల్ ఠాకూర్ హాజరు అయ్యారు. ఆమెతో పాటు ఫేమస్ బాలీవుడ్ సింగర్, ర్యాపర్ బాద్ షా కూడా హాజరు అయ్యారు. ఆ పార్టీలో ఇద్దరూ చేతులు పట్టుకుని నవ్వడం కొత్త సందేహాలకు దారి తీసింది. హిందీ ఇండస్ట్రీలో కొత్త జంట అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


బాద్ షాతో ఫోటోలు షేర్ చేసిన మృణాల్!
Is Mrunal Thakur in a relationship? : మృణాల్ ఠాకూర్, బాద్ షాతో ఫోటోలు దిగిన శిల్పా శెట్టి... ''నాకు ఇష్టమైన ఇద్దరు'' (two favourites) అంటూ ఇన్స్టాతో షేర్ చేశారు. ఆ స్టోరీని మృణాల్ షేర్ చేశారు. మృణాల్, బాద్ షా, శిల్పా శెట్టితో పాటు 'టైగర్ నాగేశ్వర రావు' హీరోయిన్ నుపుర్ సనన్ కూడా ఫోటో దిగారు. ఆ ఫోటోనూ మృణాల్ షేర్ చేశారు.


Also Read టైగర్ 3 రివ్యూ : దీపావళికి సల్మాన్ యాక్షన్ ధమాకా సౌండ్ చేస్తుందా? సినిమా హిట్టా? ఫట్టా?  


Is Mrunal Thakur getting married? : మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur Love Affair)తో బాద్ షా డేటింగ్ అంటూ ముంబై మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దాంతో బాద్ షా స్పందించారు. ''అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి... కాయిన్ గాల్లోకి విసిరా'' అంటూ పేర్కొన్నారు. దాంతో చాలా మంది ప్రేమలో పడ్డారని అనుకుంటున్నారు. మరో వైపు ఈ డేటింగ్ వార్తలపై మృణాల్ స్పందించలేదు. మౌనంగా ఉన్నారు. ఒకవేళ మౌనం అర్ధాంగీకారం అనుకోవాలేమో!? ఆవిడ స్పందన కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.


Also Read టాలీవుడ్‌లో మరో విషాదం - చంద్ర మోహన్ మరణించిన రోజే 'రొమాంటిక్ క్రైమ్ కథ', 'రొమాంటిక్ క్రిమినల్స్' నిర్మాత రవీంద్ర బాబు మృతి  



ఓ అవార్డు వేడుకలో మృణాల్ ఠాకూర్ తెలుగింటి కోడలు కావాలని అల్లు అరవింద్ ఆశీర్వదించగా... తెలుగు అబ్బాయితో మృణాల్ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. దాంతో అటువంటిది ఏమీ లేదని క్లారిటీ ఇవ్వవలసి వచ్చింది. 


bమృణాల్ ఠాకూర్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. మరో వైపు బాద్ షాకు ఓసారి పెళ్లి అయ్యింది. అయితే... 2020లో ఆయన విడాకులు తీసుకున్నారు. ఆయన మాజీ భార్య పేరు జాస్మిన్ మనీష్. బాద్ షా, జాస్మిన్ వివాహ బంధంలో ఉండగా... ఓ పాప (జెస్సేమీ గ్రేస్ మసీ సింగ్)కు జన్మ ఇచ్చారు. 


మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన 'పిప్పా' సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది. అందులో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా నటించారు.