Director Ajay Bhupathi Special Interview : 'RX 100' మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి తాజాగా పాయల్ రాజ్ పుత్ తో 'మంగళవారం' సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ మలయాళ భాషల్లో విడుదల అవుతుంది. సినిమా విడుదల సందర్భంగా అజయ్ భూపతి మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


పాయల్ పాత్ర చూసి ఆడియన్స్ షాకవుతారు


’మంగళవారం’ ఐడియా ఎలా వచ్చింది? కథకు స్ఫూర్తి ఏంటి? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ మూవీ ఐడియా ఎప్పుడు వచ్చిందనేది కచ్చితంగా చెప్పలేను. ‘మహాసముద్రం’ షూటింగ్లో ఉండగా ‘మంగళవారం’ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంతకుముందు రెండు సినిమాల కంటే కథ రాసేటప్పుడు గాని తీసేటప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీల్ అయ్యాను. కానీ కాంటెంపరరీ కథతో క్యారెక్టర్ బేస్డ్ సినిమాగా కమర్షియల్ విలువలతో మంగళవారం మూవీని తీసా. ఇటువంటి సినిమాకు దర్శకత్వం వహించడం అంత సులభం కాదు. సినిమాకు అన్ని బాగా కుదిరాయి" అంటూ చెప్పారు. పాయల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నకు బదిలిస్తూ ఆమె క్యారెక్టర్ చూసి ఆడియన్స్ అంతా షాక్ అవుతారు. జీవితంలో ఎప్పుడూ చేయనటువంటి పర్ఫామెన్స్ ఈ సినిమాలో పాయల్ చేసింది" అని చెప్పుకొచ్చాడు.


హీరోయిన్ పాత్ర కోసం 40, 50 మందితో ఆడిషన్.. 


హీరోయిన్ గా ముందు నుంచే పాయల్ ను అనుకున్నారా? అని అడిగితే.. "లేదు.. టీనేజ్ ఎండింగ్ లో ఉన్న అమ్మాయితో చేద్దామని ముందు అనుకున్నా. సుమారు 40, 50 మందిని ఆడిషన్స్ చేశా. గ్రామీణ నేపథ్యానికి సూట్ అయ్యేలా ఇన్నోసెంట్ ఫేస్ ఉండాలి. ప్రీ ప్రొడక్షన్ టైంలో హీరోయిన్ సెలక్షన్ కోసమే ఎక్కువ టైం పట్టింది. ఆ సమయంలో పాయల్ నుంచి మెసేజ్ వచ్చింది. మళ్ళీ మనం సినిమా చేద్దామని. రెండు రోజులు టైం తీసుకుని, నేను విజువలైజ్ చేసుకున్నాకే ఓకే చేశా" అని అన్నారు.


మనోభావాలు దెబ్బతిన్నాయనే.. తీసేశాం


'అప్పడప్పడతాండ్ర' పాట ఫైనల్ కట్ నుంచి తీసేడానికి కారణం ఏంటని అడగ్గా.. "పాటలో చాలామంది మనోభావాలు దెబ్బతీసేలా లిరిక్స్ ఉంటాయని సెన్సార్ ఆఫీసర్లు ఫీలయ్యారు. ఒక్క కట్ కూడా ఇవ్వలేదు. సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. పాటలో లిరిక్స్ మార్చమని అడిగారు. మారిస్తే ఇంపాక్ట్ ఉండదని సినిమాలో నుంచి తీసేసా. రెండు మూడు రోజుల్లో ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తాం" అని అన్నారు.


అందుకే ఆ ‘మంగళవారం’ టైటిల్ పెట్టాం


‘మంగళవారం’ టైటిల్ పెట్టడం వెనక రీజన్ ఏంటని అడిగితే.." మంగళవారం శుభప్రదమైన రోజు. దాన్ని జయవారం అని కూడా అంటారు. ముందు మనకు ఆ రోజు సెలవు ఉండేది. బ్రిటిషర్లు వచ్చి ఆదివారం సెలవు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే పెద్ద వంశీ గారు ఫోన్ చేశారు. మంచి టైటిల్ అజయ్, నేను చాలాసార్లు టైటిల్ పెడదామంటే నిర్మాతలు ఒప్పుకోలేదు అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా అనిపించింది" అని తెలిపారు.


Also Read : ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే మూవీస్ ఇవే - ఆ మూడు సినిమాలే స్పెషల్!