Top 10 Headlines Today:
ఐదు రోజులు ఉక్కపోతే
ఏపీని రుతుపవనాలు తాకినప్పటికీ ఐదు రోజుల పాటు వేడి వాతావరణం ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఒక రోజు ముందుగానే నైరుతి ఏపీలోకి ప్రవేశించింది. సాధారణంగా కేరళను తాకిన తర్వాత తెలుగు రాష్ట్రాలను రుతుపవాలు తాకడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. కానీ బిపర్‌జోయ్ తుపాను కారణంగా ఒక రోజు ముందుగానే నైరుతి రాగం తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మోగనున్న బడి గంట
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బడి గంట మోగనుంది. విపరీతమైన ఎండ కారణంగా పని వేళలను తగ్గించాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొత్త విద్యాసంవత్సరం పని దినాలు, చేపట్టాల్సిన కార్యచరణను ప్రభుత్వాలు విద్యాసంస్థలకు పంపించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తొలిరోజే కానుక
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వారాహి యాత్ర షెడ్యూల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చేయనున్న వారాహి యాత్రకు వైసీపీ ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తుందన్న విమర్శల నేపథ్యంలో కాస్త వెనక్కు తగ్గినట్లే కనిపిస్తోంది. వారాహి వాహనానికి అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజాకార్యక్రమాలు అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి నుంచి భారీ సభ అనంతరం వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని ఇప్పటికే జనసేన నాయకత్వం ప్రకటించింది. కాకినాడ జిల్లా నుంచి ముమ్మిడివరం నియోజకవర్గం ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి వారాహి యాత్ర ఎంటర్ కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జితేందర్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి (BRS) ను ఢీకొట్టే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ (BJP) ఒక్కటేనని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇస్తున్న లీకులతో సతమతం అవుతున్న బీజేపీ.. ఇకలాభం లేదనుకుని పార్టీ నేతలు నేడు భేటీ అయ్యారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో పార్టీ నేతలు కీలక భేటి జరిగింది. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి సహా పార్టీలో ముఖ్య నేతలు జితేందర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వడాపావ్ కాంపిటీషన్
జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి భారత్ పర్యటనకు వచ్చారు. మహారాష్ట్రలోని పుణేలో సరదాగా తన సతీమణితో కలిసి సందడి చేశారు. రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ ఆస్వాదించారు. మహారాష్ట్రలో ఫేమస్ అయిన వడాపావ్‌నీ ఎంజాయ్ చేశారు. అంతే కాదు. హిరోషి సుజుకి దంపతులు పోటీ కూడా పెట్టుకున్నారు. "ఎవరు ఎక్కువ వడాపావ్‌లు తింటారో చూద్దాం" అని ఛాలెంజ్ చేసుకున్నారు. ఈ పోటీలో హిరోషి సతీమణి విన్ అయినట్టు ఫన్నీగా ట్వీట్ చేశారు. "నా వైఫ్ ఈ విషయంలో నన్ను మించిపోయింది" అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పలు చోట్ల ఇద్దరూ కలిసి వడాపావ్ తింటూ కనిపించారు. తన సతీమణి వడాపావ్‌ని వేగంగా తినేస్తుంటే పక్కనే కూర్చుని చూస్తున్నారు హిరోషి. వడాపావ్ ఒక్కటే కాదు. ఇంకా చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్‌ని రుచి చూశారు. అయితే...ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. "ఇలాంటి పోటీల్లో ఓడిపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు" అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హెల్త్ ఇన్సూరెన్స్ జాగ్రత్తలు
ఆరోగ్య బీమా... ఎవరైనా ఎందుకు కొనుగోలు చేస్తారు? మెరుగైన ఆర్థిక భరోసా, అవసరమైన ప్రశాంతత కోసం! కానీ చాలాసార్లు బీమా తీసుకున్న కస్టమర్లు క్లెయిమ్ చేసుకొనేటప్పుడు ఇబ్బంది పడతారు. కొందరి క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతాయి. వయోవృద్ధుల బాధ చెప్పతరం కాదు! అప్పటికే ఆదాయం ఉండదు. పైగా ఎక్కువగా రోగాల బారిన పడే వయసు. అందుకే బీమా తీసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వరల్డ్ క్లాస్ థియేటర్
హైదరాబాద్‌లో, ప్రత్యేకంగా అమీర్ పేట్‌లో ఉండే వారికి సత్యం థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ థియేటర్ ఉన్న ప్రదేశంలో ఏషియన్ సత్యం మాల్ వెలిసింది. ఇందులో అల్లు అర్జున్ భాగస్వామ్యంతో ‘ఏఏఏ సినిమాస్’ అనే వరల్డ్ క్లాస్ థియేటర్‌ను కూడా నిర్మించారు. ఈ థియేటర్ జూన్ 15వ తేదీన ప్రారంభం కానుంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ థియేటర్‌ను ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రాజమౌళిపై మంత్రి హరీష్ రావు ప్రశంసలు
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి రాజమౌళి అని తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. బాహుబలి సినిమాతో మన కీర్తి దేశ వ్యాప్తం చేస్తే, RRR సినిమాతో తెలుగు వాడి ఖ్యాతిని టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి ప్రపంచ వ్యాప్తం చేశారని కొనియాడారు. బంజారాహిల్స్ లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష హాల్‌టికెట్స్ విడుదల
ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో వాయిదా పడిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం (జూన్ 11) ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్ లింకును కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి