Top 10 Headlines Today: 

 


1. కొత్త మంత్రులు... రేవంత్‌ అనుకున్న వాళ్లకేనా..?

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కేబినేట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండడంతో ఢిల్లీ వెళ్లిన సీఎం పదవులపై హైకమాండ్‌తో చర్చిస్తున్నారు. కొత్తగా మంత్రివర్గంలో శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలకు చోటు దక్కే అవకాశం ఉంది. కీలకమైన హోం, విద్య శాఖలను తన విధేయులకు కట్టబెట్టి మరింత దూకుడుగా వెళ్లాలని రేవంత్ అనుకుంటున్నారు. 


 

2.  వాళ్ల వల్లే చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు

తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుపై జగన్‌ ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టింది. ఆయనపై కోర్టుల్లో ఎన్నో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. హౌస్ కమిటీలు విచారణలు జరిగాయి. కానీ ఇంతవరకూ ఏమీ తేలకపోగా తాజాగా ఐఎంజీ పిటిషన్‌లోనూ ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఈ కేసులో అనుమానాలు క్లియర్ అయిపోయాయి. ఇలా పిటిషన్లు వేసి చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థులే క్లీన్‌ చిట్‌ ఇప్పిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
  

 

3 ఇన్సూరెన్స్‌ కోసం ప్రజల క్యూ

విజయవాడ వరదల్లో వాహనాలు చాలా వరకూ కొట్టుకుపోయాయి. మిగిలిన వాహనాలు తీవ్రంగా డ్యామేజీ అయ్యాయి. ఇప్పుడు ప్రజలు వీటికి మరమ్మతుల చేయించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇన్సూరెన్స్‌ కంపెనీలు.. ఈ వాహనాలకు బీమా ఇస్తాయా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బీమా సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన ప్రభుత్వం వెహికల్ ఇన్సూరెన్స్‌ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపించింది. అన్ని బీమా సంస్థల ప్రతినిధులను మాటిస్సోరి కాలేజీలో ఒక చోట చేర్చింది. ఈ సెంటర్‌కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

4. గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై దాడి

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో జూనియర్‌ వైద్యురాలిపై ఓ రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. కాగా డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

5. వాయుగండం.. మళ్లీ భారీ వర్షాలా..?

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొనసాగిన అల్పపీడనం ఇవాళ ఉదయానికి వాయుగుండంగా మారిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం తెలంగాణపై లేదని వెల్లడించింది. అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

6. ఆ ప్రేమికుడిని పొట్టనబెట్టుకున్న విధి

వయనాడ్‌ విలయంలో  కేరళలోని చూరాల్‌మల గ్రామానికి చెందిన శృతి.. తన కుటుంబంలోని 9 మందిని పోగొట్టుకొని  ఒంటరిగా మిగిలారు. ఆ సమయంలో శృతి నిబ్బరాన్ని ప్రధాని మోదీ కూడా అభినందించారు. క్లిష్ట సమయంలో శృతికి.. ఆమె ప్రేమికుడు జెన్సన్ అండగా నిలబడ్డాడు. జాతీయ మీడియా ఈ జంటపై అనేక కథనాలు ప్రచురించింది. ఇప్పుడు మరోసారి విధి శృతి పట్ల క్రూరంగా వ్యవహరించింది. రోడ్డు ప్రమాదంలో జెన్సన్‌ను కూడా పొట్టన పెట్టుకుంది. జెన్సన్‌, శృతిసహా కుటుంబ సభ్యులతో పాటు ఓమ్నీ వ్యాన్‌లో బయలు దేరగా అది ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శృతి సహా కుటుంబ సభ్యులకు స్వల్ప గాయలవ్వగా జెన్సన్‌ తీవ్రంగా గాయపడి మరణించాడు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

7. చిరునవ్వుతో తొక్కిపడేసిన కమలా

తొలి డిబేట్‌లోనే మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై... వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారీస్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. అమెరికా ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో ట్రంప్‌ కోపంతో ఊగిపోతే.. హారీస్‌ చిరునవ్వుతో అమెరికన్ల మనసులు గెలుచుకుంది. ఈ డిబేట్‌పై CNN నిర్వహించిన పోల్‌లో అత్యధిక అమెరికన్లకు డిబెట్‌లో హారిస్‌ సమయస్ఫూర్తిపై ప్రశంసలు కురపించారు. 63 శాతం మంది కమలకు జై కొడితే కేవలం 37 శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు మద్దతు తెలిపారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

8. ముంబైతో ముగిసిన రోహిత్‌ ప్రయాణం

ముంబై ఇండియన్స్‌కు అయిదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన రోహిత్‌ శర్మ.. ఆ జట్టును వీడుతాడనే ప్రచారం మరింత జోరందుకుంది. ముంబై ఇండియన్స్‌లో రోహిత్‌ శకం ముగిసిందని... లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ వెళ్లే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

9. నిహారిక నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ఎట్లుందంటే..?

మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థలో తాజాగా 'బెంచ్ లైఫ్' అనే వెబ్‌ సిరీస్‌ నిర్మించారు. ఇది ముగ్గురు స్నేహితుల కథగా మొదలు అవుతుంది. ఈ కథ చాలా సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఊహకు అందని మలుపులు, బాగా ఆలోచించే సన్నివేశాలు కానీ ఏమీ ఉండవు, బెంచ్‌ లైఫ్‌ ఓ కాలక్షేపం వెబ్ సిరీస్. సరదాగా కుటుంబంతో కలిసి ఓసారి చూసేయొచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

10. వైరల్ అవుతున్న దేవర సెన్సార్ రిపోర్ట్

 అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవర సెన్సార్  రిపోర్ట్ వచ్చేసింది. సినిమాకి U/A సర్టిఫికెట్  ఇవ్వగా  ఈ సినిమా డ్యూరేషన్ కి సంబంధించి కీలక అప్ డేట్  బయటపడింది.  సినిమా డ్యూరేషన్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. అంటే దాదాపు మూడు గంటలు పండగే నంటున్న అభిమానులు ఈనెల 27న మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..