Devara Censor Report Run Time: దేవర సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా డ్యూరేషన్ కి సంబంధించి కీలక అప్ డేట్ కూడా వచ్చేసింది. దేవర డ్యూరేషన్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. అంటే దాదాపు మూడు గంటలసేపు నందమూరి అభినులకు పండగేనని చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత రెండు పార్ట్ లు గా విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఒక్కటే 3 గంటల నిడివితో తీశారు దర్శకుడు కొరటాల శివ. ట్రైలర్ ఆల్రడీ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. ఈనెల 27న మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ముందునుంచీ దేవరపై యాక్షన్ మూవీ అనే బ్రాండ్ పడిపోయింది. రక్తసిక్తమైన సముద్రాన్ని చూపించి ఫస్ట్ గ్లింప్స్ లోనే యాక్షన్ ని హైలైట్ చేశారు దర్శకుడు కొరటాల శివ. ఆ తర్వాత టీజర్, తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా యాక్షన్ పార్ట్ ని బాగా ఎలివేట్ చేశాయి. కత్తులతో నరుకుతూ దేవర రక్తపాతం సృష్టించడంతో ఏ సర్టిఫికెట్ వస్తుందేమోననే అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సినిమా U/A తో సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఇక ఇటీవల కాలంలో చాలా సినిమాలు రన్ టైమ్ విషయంలో రికార్డ్ లు సృష్టిస్తున్నాయి. యానిమల్ సినిమాతో డైరెక్టర్ సందీప్ వంగ రన్ టైమ్ కి లిమిట్ లేదు అని తేల్చి చెప్పారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో రన్ టైమ్ అనేది పెద్ద కంప్లయింట్ కాదు అనే విషయం తేలిపోయింది. అయితే రన్ టైమ్ ఎక్కువ ఉన్న అన్ని సినిమాలు అలరిస్తాయని అనుకోలేం. ఇటీవల వచ్చిన గోట్ మూవీ 3 గంటల రన్ టైమ్ తో బోర్ కొట్టించిందనే కంప్లయింట్ ఉంది. ఇప్పుడు దేవరకు రన్ టైమ్ ఎంతమేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన దేవర మూవీలో తండ్రి పాత్ర ఫెరోషియస్ గా ఉంటుంది, కొడుకు పాత్ర అమాయకంగా కనిపిస్తుందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది. అయితే తండ్రిపై కుట్ర చేసిన విలన్లు, ఆయనకు అపాయం తలపెడతారా..? తండ్రి క్యారెక్టర్ దేవర సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
Also Read: ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ
పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 27న ప్రేక్షకుల ముందుకొస్తున్న దేవర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. హిందీ ప్రేక్షకుల కోసం ఆల్రడీ ముంబై వెళ్లింది దేవర టీమ్. అక్కడ ఎన్టీఆర్ కూడా జోరుగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ కావడంతో హిందీ ఆడియన్స్ కి ఈ సినిమా వెంటనే కనెక్ట్ అవుతుంది. జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవడం వెనక కూడా పాన్ ఇండియా ప్లాన్స్ ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ ఆడియన్స్ కి సుపరిచితుడయ్యారు. దీంతో దేవరపై అన్ని చోట్లా ఆసక్తి నెలకొంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ చేసిన ఈ ప్రయత్నానికి ఫలితం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Also Read: తమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవలు అంటూ వచ్చే పుకార్లకు చెక్!