America News: వాడీవేడిగా సాగిన అమెరికా ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో మాజీ అధ్యక్షుడు తెంపరి ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోతే.. భారతీయ మూలాలున్న వైస్‌ ప్రెసిడెంట్ కమలాహారిస్ మాత్రం చిరునవ్వుతోనే డిబెట్‌తో పాటు అమెరికన్ల హృదయాలనూ గెలుచుకున్నారు. ఈ డిబేట్‌పై ఇండిపెండెంట్ సంస్థ SSRS ద్వారా పోల్ నిర్వహించిన CNN.. అత్యధిక అమెరికన్లకు డిబెట్‌లో హారిస్‌ సమయస్ఫూర్తి, ఆమె విధానాలు ఆకట్టుకున్నట్లు తేలింది. దాదాపు 63 శాతం మంది డిబేట్ వ్యూవర్స్‌ కమలకు జై కొడితే కేవలం 37 శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు మద్దతు తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ , సీనా కాలేజ్ సంయుక్తంగా నిర్వ హించిన సర్వేలో ఇద్దరికీ నెక్‌ టూ నెక్‌ ఫైట్ జరిగినట్లు వీవర్స్ అభిప్రాయపడినట్లు తేలింది.


డిబేట్‌పై ట్రంప్ మద్దతుదారులే సంతృప్తిగా లేరా?:


ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ అంతగా పరఫార్మ్ చేయలేదని ఆయన మద్దతుదారులే పేర్కొన్నారు. ఆయన మద్దతుదారుల్లో దాదాపు 69 శాతం మంది మాత్రమే ట్రంప్ డిబేట్‌ పట్ల సంతృప్తి వ్యక్తం చేయగా.. హారిస్ మద్దతుదారుల్లో మాత్రం 96 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్‌లో డెమోక్రాట్లకు నాటి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్‌గా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అవుట్‌ ఫెర్మామ్ చేయగా.. ఈ డిబేట్‌లో వైస్‌ ప్రెసిడెంట్ కమలాహారిస్ సరిగ్గా బదులిచ్చారంటూ ఆమె సపోర్టర్స్‌ చెబుతున్నారు. ట్రంప్ మాత్రం డిబెట్‌ ముగిసిన తర్వాత ఇదో అద్భుతమైన డిబేట్‌గా పేర్కొంటూ ప్రకటన చేశారు. ఈ పోల్స్‌ మాత్రం డిబేట్‌పై వీవర్స్ అభిప్రాయాలను మాత్రమే తెలియ చేయనుండగా.. అవి ఓట్లుగా మారాల్సి ఉంది. ఈ డిబేట్‌ చూసిన పాప్‌ స్టార్ టేలర్ స్విఫ్ట్‌ .. హారిస్‌కు తన మద్దతు తెలిపారు.






ట్రంప్‌ ఓడాడా లేక హారిస్ గెలిచిందా?


ఈ డిబేట్‌లో ఎవరు గెలిచారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ వీక్‌నెస్‌ను పట్టుకొని హారిస్ విజయవంతంగా తన వ్యూహాన్ని అమలు చేశారు తప్ప తన పాలసీలు ఏంటన్నది పూర్తిగా వివరించలేక పోయారని కొందరు అనలిస్టులు అభిప్రాయపడ్డారు. ట్రంప్ తన సమయాన్ని ఎక్కువగా ఇమ్మిగ్రెంట్స్‌ సహా నేషనల్‌ అబార్షన్ పాలసీ మాత్రమే కేంద్రీకరించడం కూడా హారిస్‌కు కలిసి వచ్చిన అంశంగా పేర్కొన్నారు. జో బైడెన్ విఫలమైన టారిఫ్‌ ఇష్యూలోకి హారిస్‌ను లాగిన ట్రంప్‌.. దానిని సమర్థంగా కొనసాగించి ఉంటే డిబేట్ మరోలా ఉండేదని అనలిస్టులు అంటున్నారు. ఇలా ట్రంప్ చేసిన స్వయంకృతాపరాధాలు హారిస్‌కు వరంగా మారాయని తాను సులువుగా డిబేట్ చేసేందుకు అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.


ఈ డిబేట్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన వారు తమ అభిప్రాయాలను తెలిపారు. అందులో 44 శాతం మంది తమ సమస్యల పట్ల హారిస్‌కు అవగాహన ఉందని తెలపగా.. 40 శాతం మంది ట్రంప్‌ తమ సమస్యలు తీర్చగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రెంట్స్ అంశంలో కమాండ్‌ ఇన్‌ ఛీఫ్‌ మాదిరిగా ట్రంప్ ముందుండి సమస్యను పరిష్కరించగలరని అమెరికన్లు 23 అడ్వాంటేజ్ పాయింట్లు ఇవ్వగా.. ప్రజాస్వామాన్ని సంకరక్షించడంలో కమలా ముందుంటారంటూ ఆమెకు ఈ విషయంలో 9 అడ్వాంటేజ్ పాయింట్లు ఇచ్చారు. వీరి ఇరువురి మధ్య మరో డిబేట్‌ అక్టోబర్‌లో ఉంటుందని కొందరు పేర్కొంటుండగా మంగళవారం జరిగినదే మొదటిది చివరిది అయ్యే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ట్రంప్‌పై హారిస్ ఇలానే తన ఆధిపత్యాన్ని ఓట్లుగా మలుచుకోగలిగితే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలుగా మన భారత మూలాలున్న ఆమె బాధ్యతలు చేపట్టడం అంత కష్టమేమీ కాదని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.