Revanth is trying to get permission to expand the Telangana cabinet during this Delhi tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రధాన లక్ష్యం.. కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం. ఇందు కోసంఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. పాలన గాడిలో పెట్టుకుంటున్నారు. ఈ సమయంలో కీలకమైన హోం, విద్య వంటి శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. విధేయులకు ఆ పదవులు కట్టబెట్టి మరింత దూకుడుగా వెళ్లాలని రేవంత్ అనుకుంటున్నారు. కానీ సీనియర్లు రకరకాల కాంబినేషన్లతో తెర ముందుకు వస్తూండటంతో.. హైకమాండ్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. 


కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీ 


తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిపి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరు కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఆశావహులు ఉత్సాహంగా పార్లమెంట్ ఎన్నికల్లో పని చేయడానికి చూపించడానికి ఖాళీగా ఉంచారు. అందరికీ టార్గెట్లు పెట్టి ఎన్నికల్లో పని చేయించుకున్నారు. వారంతా ఇప్పుడు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆరు స్థానాల్లో భర్తీ చేస్తే.. ఇక పదువులు రావని అసంతృప్తి చెందే వారు ఉంటారు. అందుకే.. ఒకటి, రెండు ఖాళీగా ఉంచి కనీసం నాలుగు మంత్రి పదవుల్నైనా భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఇదే టార్గెట్ తో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


సెప్టెంబర్‌ 17కు కొత్త పేరు పెట్టిన రేవంత్ సర్కార్, జిల్లాలవారీగా జెండా ఎగురవేసేది వీరే


రేసులో పలువురు సీనియర్లు  
 
క్యాబినెట్ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని పలువురు సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు.  ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, వినోద్  తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. దళిత కోటాలో వీరిద్దరిలో ఒకరికి అచేచ అవకాశం ఉందని చెబుతున్నారు.  మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తమ సీనియార్టీని గుర్తిస్తారని ఎదురు చూస్తున్నారు.  రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి  ..తమ తమ జిల్లాల్లో తామే ఉండటాన్ని ప్లస్ పాయింట్ గా ఎంచుకుంటున్నారు.  వీరితో పాటు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ మంత్రి పదవుల కోసం.. హైకమాండ్ వద్ద తమ పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారు.  ఎవరికి చాన్స్ వస్తుందా అన్నది సస్పెన్స్ గానే ఉంది. 


Also Read: సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడం వారికి పెద్ద విషయమేమీ కాదు: హరీష్ రావు


రేవంత్ లిస్ట్ వేరే


రేవంత్ రెడ్డి తనకు విధేయులుగా ఉండేవారిని.. పాలనలో తన వేగాన్ని అందుకునే వారిని.. సామాజిక సమీకరణాల్ని చూసుకుని కొన్ని పేర్లు రెడీ చేసుకున్నారు. గతంలోనే ఆయన ఆ జాబితా సమర్పించారు. కానీ ఇతర సీనియర్ నేతల అభ్యంతరాలతో గ్రీన్ సిగ్నల్ రాలేదు. గతంలో ఆగిపోయినా.. తాను అనుకున్నట్లుగానే మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ పదవి ఇప్పించుకున్నట్లుగానే మంత్రి పదవుల విషంయలోనూ తాను అనుకున్న వారికే ప్రాధాన్యత ఇచ్చేలా హైకమాండ్ ను ఒప్పించాలని రేవంత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.