Clean Chit For Chandrababu :  తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. నాలుగు దశాబ్దాలకపైగా ప్రజా జీవితంలో ఉన్నారు. నాలుగోసారి సీఎంగా ఉన్నారు. మిగిలిన కాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు.  ఇంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన వారిపై ఆరోపణలు రావడం.. కేసులు నమోదవడం సహజం. అయితే చంద్రబాబునాయుడు పై జగనమోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప.. అంతకు ముంద కేసులు లేవు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ఒకటి రెండు కేసులు ఉండేవి. కానీ ఆయనపై లెక్కేలేన్ని  పిటిషన్లు కోర్టుల్లో పడ్డాయి. అలాగే హౌస్ కమిటీలు విచారణలు జరిపాయి. కానీ ఏమీ తేల్చలేకపోయాయి. తాజాగా ఐఎంజీ పిటిషన్లోనూ ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. దీంతో ఈ కేసు విషయంలో ఎవరిలోనైనా అనుమానాలు ఉంటే క్లియర్ అయినట్ల అయింది.  చంద్రబాబుకు ఇలా క్లీన్ చిట్‌లు ఇప్పిస్తోంది రాజకీయ ప్రత్యర్థులే కావడం ఇక్కడ అసలు విశేషం. 


వైఎస్ హయాం నుంచి అనేక విచారణలు


చంద్రబాబు మొదటి సారి, రెండో సారి సీఎంగా ఉన్నప్పు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోర్టుల్లో పలు పిటిషన్లు వేశారు. వాటిని పూర్తి స్థాయిలో విచారణ చేయక ముందే ఉపసంహరించుకున్నారు. తర్వాత వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 23 హౌస్ కమిటీలు వేశారని టీడీపీ నేతలు చెబుతూంటారు. అనేక  కమిటీలు చంద్రబాబు పదేళ్ల పాలనలో అవినీతిని వెలికి తీసేందుకు ప్రయత్నించాయి.  ఇప్పుడు కోర్టు కొట్టేసిన ఐఎంజీ సహా అనేక ఒప్పందాలను పరిశీలించారు. చంద్రబాబుకు ఆయన కుటుంబానికి ఏమైనా అనుచిత లబ్ది కలిగిందా.. ఆయన కుటుంబానికి ఎక్కడైనా బినామీ ఆస్తులున్నాయా అన్నదానిపై ఆరా తీశారు. అన్ని ఆరోపణలే కానీ ఒక్కటి రుజువులు చూపించలేకపోయారు. 


చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ - ఐఎంజీ పిటిషన్లలో ఆధారాల్లేవు - కొట్టేసిన తెలంగాణ హైకోర్టు


స్టే ల ప్రచారం కూడా అవాస్తవమే ! 


చంద్రబాబుపై ఎవరైనా కోర్టల్లో పిటిషన్లు వేస్తే స్టే తెచ్చకుంటారని ఆయన ఇలా పదుల సంఖ్యలో స్టేలు తెచ్చుకున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తూ ఉంటారు. కానీ ఆయనపై ఎలాంటి కేసులు పెండింగ్ లో లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదు చేసిన ఇరవైపికి పైగా కేసులు తప్ప.. చంద్రబాబుపై అంతకు ముందు కేసులు లేవు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు పోరాటం కేసు ఉంది. అయితే ఏ కేసులోనూ చంద్రబాబు స్టే తెచ్చుకోలేదు.


నన్ను తిడితే అభిమానులకు కోపం రాదా? టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మరోసారి జగన్ సంచలన కామెంట్స్


జగన్ హయాంలో నమోదైన కేసులు !


ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చంద్రబాబుపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తనపై ఎన్ని కేసులు నమోదు చేశారో తనకే తెలియడం లేదని. పోలీసులు కూడా చెప్పడం లేదని. కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చివరికి ఆయనపై ఇరవైకిపైగా కేసులు ఉన్నట్లుగా లెక్క తేల్చారు.ఇవన్నీ తప్పుడు కేసులేనని టీడీపీ ఆరోపణ.  అనేక అవినతి కేసులు పెట్టినప్పుటికి.. ఫలాా స్కాంలో చంద్రబాబు, ఆయన కుటుంబానికి ఇంత డబ్బులు ముట్టాయన్న మనీ ట్రయల్ ను మాత్రం దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించలేకపోయాయి. నిధుల మళ్లింపు, దుర్వినియోగం అనే ఆరోపణలతో కేసులు పెట్టారు కానీ.. వాటిని నిరూపించే విషయంలో కోర్టుల ముందు.. ప్రజల ముందు వివరాలు పెట్టలేకపోయారు. 


ఇప్పటి వరకూ చంద్రబాబు విషయంలో జరిగిన ఆరోపణలు, పిటిషన్ల విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇప్పించేందుకు ప్రత్యర్తులే కోర్టుకు వెళ్లారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. జగన్ హయాంలో నమోదైన కేసుల గురించి తేలాల్సి ఉంది.