Ekadasi 2024: ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి.. ఒకటి శుక్ల పక్షం...రెండోది కృష్ణ పక్షం. ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తుంది. ఏడాదికి మొత్తం 24 ఏకాదశిలు. ప్రతి ఏకాదశి ప్రత్యేకమైనదే. భాద్రపదమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏడాది పరివర్తన సెప్టెంబరు 14 శనివారం వచ్చింది. ఇంతకీ పరివర్తన ఏకాదశి అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది? పరివర్తన ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఈ ఏకాదశి నియమాలు పాటిస్తే వచ్చే ఫలితం ఏంటి? 


పరివర్తన ఏకాదశి సమయం


సెప్టెంబరు 13 శుక్రవారం సాయంత్రం 5 గంటల 32 నిముషాలకు ఏకాదశి ఘడియలు ప్రారంభమై సెప్టెంబరు 14 శనివారం సాయంత్రం 4 గంటల 30 నిముషాలకు ముగుస్తాయి. సూర్యోదయానికి తిథి ఉండడం ప్రధానం..అందుకే పరివర్తన ఏకాదశి సెప్టెంబరు 14 శనివారం వచ్చింది.


సెప్టెంబరు 15 ద్వాదశి - వామన జయంతి...
 
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగనిద్రలోకి జారుకునే శ్రీ మహావిష్ణువు.. భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు ఎడమవైపు నుంచి కుడివైపు తిరుగుతాడట. ఓ దిశ నుంచి మరో దిశ వైపు పరివర్తనం చెందడంతో దీనిని పరివర్తన ఏకాదశి అంటారు.


ప్రకృతిలో పూర్తిస్థాయిలో మార్పులు వచ్చే సమయం కూడా ఇదే..అందుకు పరివర్తన ఏకాదశి అనే పేరొచ్చిందని చెబుతారు..


Also Read: తులా రాశిలోకి విలాసాల అధిపతి.. ఈ రాశులవారి జీవితాల్లో ఇక అంతా సంతోషమే!


 ప్రతి ఏకాదశికి ఎలాంటి నియమాలు పాటిస్తారో ఈ రోజు కూడా అవే నియమాలు అనుసరిస్తారు. దశమి రోజు సాయంత్రం నుంచి నియమాలు పాటించడం ప్రారంభిస్తారు..ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి.. ద్వాదశి ఘడియలు ముగియకుండా ఉపవాసం విరమిస్తారు.  పరివర్తన ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయంటారు పండితులు. 


పరివర్తన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వామన ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారంలో మహాబలిని పాతాళానికి పంపించాడని చెబుతారు. అందుకే పరివర్తన ఏకాదశి రోజు వామనుడిని పూజించడం ద్వారా త్రిమూర్తులను సేవించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.


Also Read: సెప్టెంబరు 17 నుంచి ఈ రాశులవారి జాతకం మారిపోతుంది!


పరివర్తన ఏకాదశి రోజు విష్ణుసహస్రనామం పఠించాలి.. ప్రత్యేక పూజ అనంతరం శ్రీ మహావిష్ణువు-లక్ష్మీదేవికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం పసుపు రంగు పండ్లు దానం చేస్తే శుభఫలితాలుంటాయి. మీ జాతకంలో ఉండే గ్రహ దోషాలను అనుసరించి పప్పు ధాన్యాలు దానం ఇవ్వాలి. ముఖ్యంగా మీ జాతకంలో బృహస్పతి దోషం ఉంటే ఈ రోజు పప్పు ధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా ఆ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది ..ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయి..ఆరోగ్యం మెరుగుపడుతుంది.  కుటుంబంలో ఉండే సమస్యలు పటాపంచలైపోతాయి. ఏకాదశి ఉపవాసం విరమించే సమయం దాన ధర్మాలకు అత్యుత్తమం..పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం ద్వారా మీకు అన్నీ శుభఫలితాలే ఉంటాయి.   


ఏకాదశి నియమాలు పాటించేవారు.. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. మౌనవ్రతం పాటించడం అత్యుత్తమం. మద్యం, మాంసం ముట్టుకోవద్దు.. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైనే నిద్రించాలి. అనారోగ్యంతో ఉండేవారు ఓ పూట భోజనం చేసి విష్ణు ధ్యానం చేసుకోవ్చచు. అసత్యం పలకడం, హింసకు పాల్పడం అస్సలు చేయకూడదు.  


Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.