Daily Horoscope for 12 September 2024
మేష రాశి
ఈ రోజు మీ పని వేగంగా పూర్తవుతుంది. ప్రేమ సంబంధిత విషయాలలో నిరాశను ఎదుర్కోవచ్చు. కళా రంగానికి సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. స్నేహితుల సలహాలపై శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది..
వృషభ రాశి
కుటుంబానికి సమయం కేటాయిస్తారు. బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి..సీరియస్ గా తీసుకోండి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి నిరాశ చెందొద్దు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేయండి.
మిథున రాశి
ఈ రోజు మీరు ఊహించని ప్రయోజనం పొందుతారు. మిమ్మల్ని అందరూ విశ్వసిస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. మితిమీరిన అసహనం మంచిది కాదు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి.
Also Read: తులా రాశిలోకి విలాసాల అధిపతి.. ఈ రాశులవారి జీవితాల్లో ఇక అంతా సంతోషమే!
కర్కాటక రాశి
ఈ రోజు మీ కోసం అవకాశాలు వేచి ఉన్నాయి..సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. గృహ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం తీసుకున్నాకే నూతన పెట్టుబడులు పెట్టండి.కుటుంబం నుంచి సహకారం లభిస్తుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది.
సింహ రాశి
పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. వ్యాపారంలో ప్రతిదీ ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్లు కనిపిస్తుంది...ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
కన్యా రాశి
ఈ రోజు ఆకస్మికంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఉండవచ్చు. అహంభావన నష్టాన్ని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తప్పుడు ఆలోచనలు మనసులోకి రానివ్వవద్దు. ఆదాయం పెరుగుతుంది.
Also Read: సెప్టెంబరు 17 నుంచి ఈ రాశులవారి జాతకం మారిపోతుంది!
తులా రాశి
ఈ రోజు ఆర్థికంగా లాభ పడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఈ రోజు ఓ గుడ్ న్యూస్ వింటారు. భారీ పరిశ్రమలు నిర్వహించే వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సృజనాత్మకంగా పని చేయాలి అనుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
వృశ్చిక రాశి
ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి నుంచి సలహాలు తీసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంంది. నూతన ఇల్లు లేదా భూమిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఇతరులు చెప్పే విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వొద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రోజు మీ శత్రువులు యాక్టివ్ గా ఉంటారు..మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఖర్చులు అదుపుచేసేందుకు ప్రయత్నించండి. ఊహల్లో విహరించవద్దు. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి కానీ పూర్తవుతాయి. గుడ్ టైమ్ మీకు మొదలవుతోంది.
మకర రాశి
పాత స్నేహితులను కలుస్తారు. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి , ఉద్యోగాలలో సాధారణ ఫలితాలుంటాయి. ఆహారంపై నిర్లక్ష్యం వద్దు.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి - వార ఫలాలు ( సెప్టెంబరు 09 - 15)
కుంభ రాశి
మీ జీవిత భాగస్వామి మీకు మంచి స్నేహితులుగా మారుతారు. మీ ప్రతి ఆలోచనా పంచుకోవచ్చు..ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు పనితీరు మెచ్చుకోలుగా ఉంటుంది.
మీన రాశి
పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. మనసులో ఏదైనా భయం ఉంటే తొలగిపోతుంది. జీవిత భాగస్వామిపట్ల గౌరవ భావం ఏర్పడుతుంది
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.