What is GNSS | గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్ సిస్టమ్స్- GNSS ద్వారా ప్రైవేటు కార్లకు టోల్ ఫీజుల నుంచి ఉపశమనం కల్పిస్తామంటూ కేంద్రం ప్రకటించిన వేళ.. GNSS గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు ఈ జీఎన్‌ఎస్‌ఎస్ అంటే ఏంటి ? మన కార్లలో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఆ ఇన్‌స్టలేషన్ కోసం మన కార్లలో తప్పనిసరిగా ఉండాల్సిన పరికరాలు ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికన్ల జీపీఎస్, రష్యన్ల గ్లోనాస్, యూరోఫియన్ల గెలీలో , చైనా వాళ్లు బైడో ఇక ఇండియన్లు INRSS అని పిలిచినా అన్నీ జీఎన్‌ఎస్‌ఎస్ కిందకే వస్తాయి. 1957లో రష్యన్లు స్పుత్నిక్-1 శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపినప్పటి నుంచి జీఎన్‌ఎస్‌ఎస్‌పై ప్రయోగాలు మొదలు కాగా 70 ఏళ్ల తర్వాత ఈ ఇన్‌విజిబుల్ ఆయుధం మన చేతిలోకి వచ్చింది.
జీఎన్‌ఎస్‌ఎస్ అంటే ఏంటి ?
జీఎన్‌ఎస్‌ఎస్ అంటే కొన్ని శాటిలైనట్లను ఒక నెట్‌వర్క్‌లో అనుసంధానించి బ్రాడ్‌కాస్టింగ్ టైమింగ్స్, ఆర్బిటాల్ ఇన్ఫర్మేషన్ సాయంతో నావిగేషన్ సహా పొజిషనింగ్ మెజర్మెంట్స్ (అక్షాంశం రేఖాంశాలు) ఆధారంగా ఒక వ్యక్తి లేదా వాహనం లేదా వస్తువు యొక్క కచ్చితమైన పొజిషన్‌ను లెక్కించడం వీలవుతుంది. జీఎన్‌ఎస్‌ఎస్ కోసం నెట్‌వర్క్‌లో అనుసంధానించే శాటిలైట్లు స్పేస్‌లో 20 వేల నుంచి 37 వేల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. ప్రతిదేశం తమదైన నావిగేషన్ వ్యవస్థ రూపొందించుకునేందుకు శాటిలైట్లను స్పేస్‌లోకి పంపి నెట్‌వర్క్‌గా ఏర్పాటు చేసుకుంటాయి. భారత్ కూడా IRNSS అనే నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవస్థ కోసం శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా సమీప భవిష్యత్‌లో భారత్ సొంత GNSSను దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
GNSS కోసం ఏ దేశం ఎన్ని శాటిలైట్లను స్పేస్‌లోకి పంపిందంటే?
అమెరికా జీఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థ GPS కోసం 1978 నుంచి 1993 వరకు 31 శాటిలైట్లను స్పేస్‌లోకి పంపి జీపీఎస్ వ్యవస్థను రూపొందించుకోగా.. రష్యా 1995లో మొదలు పెట్టి 2010 నాటికి 24 శాటిలైట్లతో గ్లోనాస్‌ను అభివృద్ధి చేసింది. యూరప్ తమ గెలీలో వ్యవస్థ కోసం ౩౦ శాటిలైట్లను వినయోగిస్తుండగా .. చైనా బైడౌ వ్యవస్థ కోసం 2000 సంవత్సరం నుంచి 20 ఏళ్ల పాటు 48 శాటిలైట్లను నింగిలోకి పంపి నేవిగేషన్ వ్యవస్థను రూపొందించుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 8 శాటిలైట్ల సాయంతో IRNSS నేవిగేషన్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది.
జీఎన్‌ఎస్‌ఎస్‌తో ఉపయోగాలేంటి?
జీఎన్‌ఎన్‌ఎస్ అప్లికేషన్ల సాయంతో.. ప్రపంచంలోని ఏ లొకేషన్‌ని అయినా ప్రిసైజ్‌డ్‌గా గుర్తించవచ్చు. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశంకి వెళ్లేందుకు బెస్ట్‌రూట్‌ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ప్రపంచంలో ఏ వస్తువు మూవ్‌మెంట్‌ని అయినా ఇంట్లో కూర్చొనే ఈ వ్యవస్థ సాయంతో గుర్తించవచ్చు. సెకనులో బిలియన్త్ వంతును కూడా ప్రిసైజ్‌డ్‌గా లెక్కించవచ్చు. జీఎన్‌ఎస్‌ఎస్‌ను మన కార్లలో లేదా ఇతర వాహనాల్లో వినియోగించుకునేందుకు అనేక పరికరాలను ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేశారు. వీటికి ప్రాథమికంగా కావాల్సింది మాత్రం యాంటెనా అండ్ రిసీవర్. యాంటెనా సాయంతో శాటిలైట్ నుంచి వచ్చే బలమైన సిగ్నల్స్‌ని రిసీవర్‌కు అనుసంధానం చేయొచ్చు.
ఇప్పటికే మన ఫోన్లలు మనం గూగుల్ మ్యాప్స్ సాయంతో నావిగేషన్ , లొకేషన్ తదితర అంశాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నాం.
ఇప్పుడు కేంద్రం ఈ జీఎన్‌ఎస్‌ఎస్ సాయంతో టోల్ వసూలు వ్యవస్థను ముందుకు తీసుకెళ్లనున్న తరుణంలో మన ఇస్రో అభివృద్ధి చేసిన IRNSS ను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. లేదా అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు జీపీఎస్ మీద ఆధారపడే అవకాశం ఉంది.