Apple Watch Ultra 2: ఆపిల్ సంస్థ ఆపిల్‌ వాచ్ సిరీస్ 10తో పాటు, కొత్త ప్రీమియం వాచ్ అల్ట్రా 2ని కూడా విడుదల చేసింది. ఈ వాచ్‌లో కంపెనీ అనేక ఆధునిక ఫీచర్లు యాడ్ చేసింది. ఈ వాచ్‌లో వినియోగదారులు ఇప్పుడు ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్ ఫీచర్‌ పొందవచ్చు. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్ యూజర్లకు అందిస్తోంది. దీని డిజైన్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ పరికరం ప్రీ-ఆర్డర్ బుకింగ్ కూడా స్టార్ట్ చేసింది. 


ఆపిల్ వాచ్ అల్ట్రా 2 స్పెసిఫికేషన్‌లు
వాచ్ 10 సిరీస్‌తో పాటు, ఆపిల్ తన కొత్త వాచ్ అల్ట్రా 2ని కూడా ఆపిల్ ఈవెంట్‌ 2024లో విడుదల చేసింది. ఈ వాచ్‌ స్ట్రాంగ్ టైటానియం కేసు కలిగి ఉంది. ఇది స్క్రాచ్ రెసిస్టెంట్ ఫ్రంట్ క్రిస్టల్‌ను కలిగి ఉంది. వాచ్ అల్ట్రా 2 డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPSతో కూడిన అధునాతన పొజిషనింగ్ సాఫ్ట్‌వేర్‌తో వస్తోంది. ఇప్పటి వరకు ఏ స్పోర్ట్స్ వాచ్‌లోనూ ఈ టెక్నాలజీ వాడలేదు. 


Also Read: అద్భుతమైన ఆరోగ్య ఫీచర్లతో ఆపిల్ వాచ్ 10 సిరీస్‌ విడుదల- ఇండియాలో ధర ఎంత అంటే?


ఈ కొత్త ఫీచర్‌తో చాలా మెరుగైన నావిగేషన్ సదుపాయాన్ని యూజర్లు పొందుతారు. ఇది అథ్లెటిక్స్ కార్యకలాపాలకు చాలా యూజుఫుల్ అవుతుంది. ఇది రన్నర్లు, సైక్లిస్ట్‌లు, స్విమ్మర్స్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వాచ్‌లో ఈతగాళ్ల కోసం డెప్త్ సెన్సార్ అందిస్తోంది. ఈ వాచ్‌లో ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్, ల్యాప్ కౌంట్స్, కొత్త ట్రైనింగ్ లోడ్ ఇన్‌సైట్స్ సిస్టమ్‌ను పొందుపరిచింది. ఒక యాక్షన్ బటన్ కూడా జత చేశారు. దీని ద్వారా వినియోగదారులు వెంటనే రిపోర్ట్ చేయవచ్చు. 
ఆపిల్ వాచ్ అల్ట్రా 2లో ఆఫ్‌లైన్ మ్యాప్ సదుపాయం కూడా ఉంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఎక్కడైనా వెళ్లేటప్పుడు డైరెక్షన్ చూపడంలో సహాయపడే అధునాతన నావిగేషన్‌ను కలిగి ఉంది. 


Also Read: అద్భుతమైన ఆరోగ్య ఫీచర్లతో ఆపిల్ వాచ్ 10 సిరీస్‌ విడుదల- ఇండియాలో ధర ఎంత అంటే?


స్క్రాచ్ రెసిస్టెంట్, కార్బన్ PVD కోటింగ్‌తో తీసుకొచ్చిన శాటిన్ బ్లాక్ ఫినిషింగ్‌తో ఈ వాచ్‌ను ఆపిల్ విడుదల చేసింది. ఇది 95 శాతం రీసైకిల్ చేసిన గ్రేడ్ 5 టైటానియం నుంచి తయారు చేశారు. ఇది ఎక్కువగా ఏరోస్పేస్ పరిశ్రమ నుంచి వస్తుంది.






ధర ఎంత
ప్రీమియం Apple Watch Ultra 2ని 799 డాలర్లకు అమ్ముతుంది. అంటే ఇండియన్ రూపీ ప్రకారం 67 వేల రూపాయలు ధర ఉంటుంది. ఈ ప్రీమియం వాచ్ ప్రీ-ఆర్డర్ బుకింగ్ కూడా ఆపిల్ ప్రారంభించేసింది. సెప్టెంబర్ 20 నుంచి అమెరికాలో దీన్ని డెలివరీ ప్రారంభించనుంది. 


Also Read: అదిరిపోయే ఫీచర్స్‌తో లాంచ్ అయిన iPhone 16 Pro- బిగ్‌ స్క్రీన్, స్పెషల్ కెమెరా ఫీచర్స్‌ ఉన్న ఈ ఫోన్ ధర ఎంతంటే?