Health News In Telugu | ముఖ్యంగా కాల్ళలోని రక్తనాళాలను ప్రభావితం చేసే ఈ సమస్య  ప్రత్యేకంగా కాళ్ళకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల నొప్పి, కండరాల్లో బలహీనత కలుగుతుంది.


పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ లక్షణాలు


క్లాడికేషన్ (Claudication)


నడిచే సమయంలో లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి లేదా పిక్కల్లో నొప్పి వస్తుంది.  ఇది కాళ్ళకు తగినంత రక్త ప్రసరణ లేదనేందుకు సంకేతం. విశ్రాంతి గా ఉన్నపుడు ఈ నొప్పి తగ్గుతుంది.


 క్షీణించిన రక్త ప్రవాహం


రక్తనాళాలు సన్నబడినప్పుడు, కాళ్ళు చల్లగా అనిపిస్తాయి, మరియు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో కూడా కాలి పిక్కల్లో నొప్పి రావచ్చు.


పాదాలలో మచ్చలు లేదా గాయాలు


పాదాలు లేదా కాళ్ల మీద గాయాలైనపుడు అవి తేలికగా మానడం లేదంటే  PAD ఉన్నట్లుగా భావించాలి.


నరాల నొప్పి లేదా బలహీనత


పిక్క కండరాలు బలహీన పడి కాళ్లలో అసాధారణమైన కదలికలు అవుతుంటే కూడా పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ అని అనుకోవాలి.


పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ కారణాలు


ఆథిరోస్క్లెరోసిస్ (Atherosclerosis)


అథెరోస్క్లీరోసిస్ పెరఫెరల్ ఆర్టరీ డిసీజ్ కు  ప్రధాన కారణం. ఈ సమస్యలో రక్తనాళాల గోడలపై కొవ్వు పేరుకుపోయి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. ఫలితంగా కాళ్ళకు సరిపడినంత రక్తప్రసరణ జరగదు.


పొగతాగడం


పొగతాగే అలవాటు  రక్తనాళాల ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది.  కదలికను దెబ్బతీస్తుంది మరియు రక్తప్రసరణను తగ్గిస్తుంది.


మధుమేహం


 డయాబెటీస్ ఉన్నవారిలో రక్తనాళాల సమస్యలు సాధారణం. మధుమేహుల్లో PAD సులభంగా వస్తుంది. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి.


హైబీపీ (High Blood Pressure)


రక్తనాలాల మీద రక్తం కలిగించే అధిక ఒత్తిడి వాటి లోపలి గోడలను దెబ్బతీస్తుంది. ఫలితంగా రక్తనాళాల వైశాల్యం తగ్గుతుంది. అందువల్ల పెరీఫెరల్ ఆర్టరీ డసీజ్ రావచ్చు.


అధిక కొలెస్ట్రాల్


రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే  రక్తనాళాలను బిరుసుగా మారుస్తుంది. ఫలితంగా ఇవి తగినంత వ్యాకోచించలేవు. రక్తనాళాలు ఇరుకుగా మారడం వల్ల పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ కు కారణం అవుతుంది.


 చికిత్స, నివారణ:జీవనశైలి మార్పుల:


  పోగతాగడం వెంటనే మానెయ్యాలి. PAD నివారణలో ఎంతో ముఖ్యమైనది.


ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవాలి. తగినంత వ్యాయామం చేయడం వల్ రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవచ్చు.


రక్త ప్రసరణను మెరుగుపరిచే మందులు కూడా వడవచ్చు.


రక్తనాళాల లోపలి గోడల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే స్టాటిన్స్ వాడుకోవచ్చు.


రక్త ప్రసరణ మెరుగు పరిచేందుకు కండరాలలో కాథెటర్ ద్వారా  బెలూన్ చొప్పించడం ద్వారా విస్తరణ పెంచవచ్చు.


 ప్రభావిత రక్తనాళాల నుంచి రక్తప్రసరణ మార్గాన్ని మార్చేందుకు  మార్గాలను సృష్టించడాన్ని బై పాస్ సర్జరీ అంటారు.


నివారణ చిట్కాలు


శరీర బరువును తగ్గించుకోవడం.


ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.


క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.


ఆల్కాహాల్ తగ్గించడం.


పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే గంగ్రీన్ వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు.  కాబట్టి సరైన వైద్య సలహా తీసుకోవడం అవసరం.