Top 10 Headlines Today:
వరదబాధితులకు చిరు సాయం
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు, పోటెత్తిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజల కోసం మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు సీఎం సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వాన హెచ్చరికలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పిన వివరాల ప్రకారం మధ్య విదర్భ, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న అల్ప పీడన ప్రాంతం ఏర్పడింది. దీని దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ప్రారంభంకానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చంద్రబాబు క్షేత్రస్థాయికి వెళ్లడం తప్పా?
బుడమేరు విశ్వరూపానికి విజయవాడ మునిగిపోయింది. లక్షల మంది సమస్యల్లో ఉన్నారు. ఊహించని పరిణామంతో కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న చంద్రబాబు ప్రజల్లోనే ఉన్నారు. అలా చేయడం పబ్లిసిటీ స్టంట్ అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలా నేరుగా వెళ్లాల్సిన పని లేదని అంటున్నారు. ఏది కరెక్ట్? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కేసీఆర్ సైలెన్స్‌కు కారణమేంటీ?
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జైలు నుంచి వచ్చిన కుమార్తెకు స్వాగతం చెబుతూ చాలా రోజుల తర్వాత కనిపించారు. తర్వాత కార్యచరణ ఉంటుందని అంతా భావించారు. కానీ అది లీక్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు కూడా ఆయన సైలెంట్ గానే ఎందుకున్నారనే చర్చనడుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేను రాకపోయినా...
విజయవాడ వరదలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే విపత్తు రావడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే బుడమేరుకు ముప్పు వచ్చిందని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే తాను బయటకు రాలేదని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఎక్కడిదీ సంస్కృతి
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడిని కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ గుండాలు తమ నేతలపై దాడి చేయడం హేయమమైన చర్యగా అభివర్ణించారు. ఇది కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హ్యాపీ న్యూస్
వర్షాలకు అస్తవ్యస్తంగా మారిపోయాయిన తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రాంతాలకు ఎయిర్‌టెల్ శుభవార్త చెప్పింది. తమ వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్ కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అవమానాలు దిగమింగి....
పారిస్ ఒలింపిక్స్‌లో తెలుగమ్మాయి దీప్తి జీవాంజి సత్తా చాటింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలుగు ఖ్యాతిని చాటిచెప్పింది. వరల్డ్ రికార్డు సృష్టించి మరీ కాంస్య పతకాన్ని మోగించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అరగంట నిద్ర చాలంటున్న జపాన్ వాసి
రోజులో ఓ అరగంట నిద్ర తగ్గితేనే రోజంతా ఏదోలా ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం రోజులో అరగంట మాత్రమే పడుకుంటాడట. అందుకే జపాన్‌కి చెందిన డైసుకే హోరి అనే వ్యక్తి ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
భయపెడుతున్న టోవినో థామస్
మలయాళ యంగ్ స్టార్ టోవినో థామస్ హీరోగా నటించిన '2018'తో తెలుగు వాళ్లకు దగ్గరైపోయాడు. మలయాళంలో ఆయన చేసిన ఓ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులో ఎంటర్‌టైన్ చేయనుంది. 'దసరా', 'రంగ బలి' సినిమాల్లో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన షైన్ టామ్ చాకో ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి