Japanese Man Sleeps For 30 Minutes : రోజుకు కేవలం అరగంటే నిద్రపోతున్న జపనీస్ వ్యక్తి.. 12 ఏళ్లుగా ఇదే తంతు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

30 minutes sleep a day : జపాన్​కి చెందిన ఓ వ్యక్తి రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్నాడట. దానికి గల కారణమేంటో తెలిస్తే.. కచ్చితంగా షాక్ అవుతారంటున్నారు. ఇంతకీ అతనికి ఈ నిద్ర సరిపోతుందా?

Continues below advertisement

Ultra Short Sleeper Daisuke Hori : రోజులో ఓ అరగంట నిద్ర తక్కువైతేనే కొందరికి పిచ్చి లేస్తూ ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి రోజు మొత్తంలో కేవలం అరగంటే పడుకుంటున్నాడట. జపాన్​కి చెందిన డైసుకే హోరి అనే వ్యక్తికి రోజుకు కేవలం 30 నిమిషాలే నిద్రపోతాడట. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. 12 సంవత్సరాల నుంచి.. ఇతను దీనిని కొనసాగిస్తున్నాడు. అసలు దీనివెనుక కారణమేంటి? ఇప్పుడు అతని శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

డాక్టర్లు, నిపుణులు రోజుకు 6 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలంటారు. సరైన నిద్ర లేకుంటే ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని.. నిద్రను అశ్రద్ధ చేయవద్దని చెప్తారు. పైగా సరైన నిద్ర లేకుంటే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారిపోతుంది. ఆరోగ్యంగా ఉండాలన్నా.. మెదడు తీరు బాగా పనిచేయాలన్న నిద్ర ముఖ్యమని చెప్తారు. అయితే డైసుకే హోరి మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాడు. 24 గంటల్లో కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నాడు. ఎందుకంటే.. 

ఒక్క రీజన్​తో మొత్తం మార్చేశాడు..

తన జీవితకాలాన్ని రెట్టింపు చేసుకోవడానికి తన నిద్రను తగ్గించుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్​లో నివేదించింది. డైసుకే తన జీవితకాలాన్ని రెట్టింపు చేసుకోవడానికి 12 సంవత్సరాలుగా.. కేవలం 30 నిమిషాలే నిద్రపోతున్నాడట. ఇదేమి ఆరోగ్య సమస్యల వల్ల రాలేదని.. స్వతహాగా అతను తీసుకున్న నిర్ణయమేనని పోస్ట్​లో రాసుకొచ్చారు. తక్కువ నిద్రతోనే మెదడు సాధారణంగా, యాక్టివ్​గా పనిచేసేలా తనని తాను ట్రై చేసుకున్నట్లు హోరి తెలిపాడు. దీనివల్ల తన పని సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని తెలిపాడు. అతను నిద్రని ఎలా తగ్గించుకున్నాడు.. ఆరోగ్యం ఎలా ఉంది వంటి వాటి గురించి కూడా హోరి వివరించాడు. 

అలా నిద్రను తగ్గించుకున్నాడట..

తినడానికి గంట ముందు వ్యాయామం లేదా కాఫీ తాగితే నిద్రను దూరం చేసుకోవచ్చని హోరి తెలిపాడు. అరగంట నిద్ర సరిపోతుందా అంటే.. ఎక్కువ సమయంలో నిద్రపోవడం కంటే.. అధిక నాణ్యతతో కూడిన నిద్ర శరీరానికి చాలా ముఖ్యమని అతను తెలిపాడు. సరైన నిద్ర కొంచెం ఉన్నా.. అది సుదీర్ఘ నిద్రకు మించిన ఫలితాలు ఇస్తుందని వెల్లడించాడు. ఈ విషయాలను నమ్మడం కష్టతరంగా భావించిన.. జపాన్​కు చెందిన టీవి ఛానల్​ అతనిని అబ్జర్వ్ చేస్తూ ఓ వీడియో చేసింది. 

కేవలం 26 నిమిషాలే..

జపాన్​కు చెందిన యోమియురి టీవీ విల్​ యు గో విత్ మి అనే రియాలిటీ షోలో అతనిపై మూడు రోజులు ఫోకస్ పెట్టింది. హోరి 24 గంటల్లో కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడని.. అనంతరం తన రెగ్యూలర్​ పనులు చేసుకున్నాడని గుర్తించింది. యాక్టివ్​గా లేచి.. బ్రేక్​ఫాస్ట్ చేసి.. పనితో పాటు జిమ్​కి వెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పనులు చేసుకున్నాడని తెలిపింది. ఈ నేపథ్యంలోనే 2016లో జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్​ అసోషియేషన్​ను హోరీ స్థాపించాడు. నిద్రకు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అతను అవగాహన కల్పిస్తాడు. ఇప్పటివరకు అతను 2,100 మందిని ఆల్ట్రా-షార్ట్ స్లీపర్​లుగా మార్చాడని సౌత్ చైనా పోస్ట్​లో రాసుకొచ్చారు. 

ట్రై చేయకపోవడమే మంచిది..

హోరిని చూసి.. మనం కూడా ఇలా చేయొచ్చా అని అనుకోవద్దని.. ఒక్కొక్కరి శరీర తత్వం బట్టి ఈ మార్పులు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న మార్పులతో ఈ స్థాయికి చేరుకుంటారని.. అయితే ఇవి కొందరిని ఇబ్బందులకు గురిచేస్తాయని కూడా తెలిపారు. కాబట్టి నిపుణులు సలహాలు, సూచనలు లేకుండా ఇలాంటివి చేయొద్దని వారు చెప్తున్నారు. అయితే ఇంతకు ముందు ఇలా ఎవరూ చేయలేదా? అంటే ఇక్కడో ఎగ్జాంపుల్ ఉంది. 

60 ఏళ్లు నో నిద్ర..

థాయ్​కు చెందిన ఎన్​గోక్ అనే 80 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్లకు పైగా నిద్రపోలేదట. అతని పేరు వియత్నామీస్. 1962లో జ్వరం వచ్చిన తర్వాత అతను నిద్రపోయే సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఏ చికిత్స, ఏ నిద్ర మాత్ర కూడా అతనికి పనిచేయలేదట. కానీ హోరి విషయంలో ఇది ఆరోగ్యపరంగా వచ్చిన సమస్య కాదు. తనంతట తానే నిద్రను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. పైగా హెల్తీగాను ఉన్నాడు. 

Also Read : ప్లాస్టిక్ బాటిల్స్​లో నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా? న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు

Continues below advertisement
Sponsored Links by Taboola