పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన 'మెగా' మనసు చాటుకున్నారు. ఇటీవల కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో ప్రకృతి విపత్తు తలెత్తిన సమయంలో తనయుడు రామ్ చరణ్ (Ram Charan)తో కలిసి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మరోసారి మెగా విరాళం ప్రకటించారు చిరంజీవి.


ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కోటి విరాళం
ఇప్పుడు ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు చిరంజీవి. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు, అదే విధంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో 50 లక్షలు ప్రకటించారు. ''ఈ విపత్కర  పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను'' అని చిరంజీవి పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏం ట్వీట్ చేశారంటే...






Also Readశ్రీను వైట్ల మార్క్ కామెడీతో 'విశ్వం' టీజర్ - వైఎస్ జగన్‌ను వాడేసిన గోపీచంద్



చిరంజీవి కంటే ముందు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోటి రూపాయలు (ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరొక 50 లక్షల విరాళం) ఇచ్చారు. ఏపీకి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోటి విరాళం ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, చినబాబు (సూర్యదేవర రాధాకృష్ణ), సూర్యదేవర నాగవంశీ కలిసి రూ. 50 లక్షలు, సిద్ధూ జొన్నలగడ్డ రూ. 30 లక్షలు, దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 10 లక్షలు, విశ్వక్ సేన్ రూ. 10 లక్షలు, హీరోయిన్ అనన్యా నాగళ్ళ రూ. 5 లక్షలు, యాంకర్ స్రవంతి చొక్కారపు రూ. లక్ష విరాళంగా ఇచ్చారు.


Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే