Weather Latest News: సెప్టెంబరు 3న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న మధ్య విదర్భ, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ప్రస్పుటమైన అల్ప పీడన ప్రాంతం ప్రస్తుతం అల్పపీడన ప్రాంతం గా బలహీన పడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతం లో కెద్రీకృత్త మై ఉంది. దీనికి అనుభందం గా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది.


ఋతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్ర మట్టం నుండి జైసల్మేర్, ఉదయపూర్,  పశ్చిమ విదర్భ వద్ద ఉన్న అల్పపీడన కేంద్రం, దాని పరిసర ప్రాంతాల్లోనూ రామగుండం కళింగపట్నం, అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది.
  
ఉపరితల ఆవర్తనం ఒకటి కోస్తా ఆంధ్ర యానాం, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల వరకు ఏర్పడింది.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి  కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings):
ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.


ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు,  ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో అక్కడ అక్కడ వీచే అవకాశం వుంది.


నేడు భారీ వర్షాలు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగం) వర్షాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.2 డిగ్రీలుగా నమోదైంది. 93 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: సగటు సముద్రమట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఉదయపూర్ అల్ప పీడన కేంద్రం, పశ్చిమ విదర్భ, పరిసర ప్రాంతాలపై నుంచి రామగుండం, కళింగపట్నం, ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం గుండా వెళ్తోంది. 


ఉత్తర ద్వీపకల్ప భారత దేశంలో షీర్ జోన్ ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి పైన 3.1 కిలో మీటర్ల వద్ద దాదాపు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద కొనసాగుతుంది. సెప్టెంబరు 5 నాటికి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 


Also Read: వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం - మహేష్ బాబు సైతం భారీగానే సాయం


ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.  భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.


Also Read: విజయవాడలో వరద బాధితుల్ని అందుకే కలవలేదు - పవన్ కల్యాణ్ క్లారిటీ