Is Chandrababu participation in relief programs is a publicity stunt : బుడమేరు విశ్వరూపానికి విజయవాడ సగం మునిగింది. ప్రజలు లక్షల మంది ఇబ్బంది పడ్డారు. పరిస్థితి ఊహించనంత తీవ్రంగా ఉందని గుర్తించిన చంద్రబాబు అన్ని అధికారిక కార్యక్రమాలనూ రద్దు చేసుకుని మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉన్నారు. ఆయన కాన్వాయ్ ను వదిలేసి బుల్డోజర్ మీదనే తిరిగారు. రోజుకు , రెండు మూడు గంటలే నిద్రపోయారు. లక్షల మంది బాధితుల్ని సంతృప్తి పరిచేలా ఆదుకోలేకపోయినా అందర్నీ ఇన్వాల్వ్ చేసి.. వీలైనంత ఎక్కువ మంది ఆకలి తీర్చారు. ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారు. అయితే ఆయన అలా చేయడం అంతా పబ్లిసిటీ స్టంట్ అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. సీఎం ఇలా క్షేత్ర స్థాయిలోకి వెళ్లాల్సిన పని లేదని అంటున్నారు. 


మొదటి నుంచి చంద్రబాబు ఫీల్డ్ లెవల్ సీఎం


చంద్రబాబునాయుడు మొదటి నుంచి ఏదైనా సమస్య వస్తే ఫీల్డ్ లెవల్ నుంచి  పని చేస్తారు. మొదటి సారి సీఎం అయినప్పటి నుంచి  వరదలు, విపత్తు సమయంలో ఆయన స్టైల్ అదే. హుదూద్ వచ్చినప్పుడు విశాఖను మళ్లీ ఓ దారిలోకి తెచ్చే వరకూ బస్సులోనే ఉండి మొత్తం పనులు చేశారు. ఇప్పుడు విజయవాడ వరదల్లోనూ అదే చేస్తున్నారు. ఇక్కడ గుర్తించాల్సింది ఆయన వయసు. మొదట సీఎం అయినప్పుడు ఆయన నలభైల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు 74 ఏళ్లకు వచ్చారు. ఆయనా ఆయన పనితీరులో మార్పు రాలేదు. జేసీబీలు ఎక్కి అంతా తిరిగారు. ఆయన నిబద్దత చూసి చాలా మంది బాధితులు కూడా ఆశ్చర్యపోయారు.


వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ భారీ విరాళం, చంద్రబాబును కలవనున్న డిప్యూటీ సీఎం


పబ్లిసిటీ కోసమే చేస్తారా ?


అయితే చంద్రబాబు ఇలా చేయడం పబ్లిసిటీ కోసమేనని వైసీపీ నేతల ఆరోపణ. సీఎం అనే వ్యక్తి ఫీల్డ్ లెవల్ కి వెళ్తే పనులు ఆగిపోతాయని.. వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఆదేశాలు ఇస్తే చాలని ఎవరి పని వారు చేస్తారని అంటున్నారు. చంద్రబాబునాయుడు ఫోటోల పిచ్చి కోసమే వెళ్తున్నారని అంటున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇలా విపత్తులు వచ్చినప్పుడు ఎప్పుడూ ఫీల్డ్ లోకి వెళ్లలేదు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు కూడా వెళ్లలేదు. సీఎం అనే వ్యక్తి ఇలా విపత్తులు వచ్చిన సమయంలో వెళ్తే అధికారులు అంతా తన వెంటే ఉంటారని  ఇక సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతాయని వాదించారు. ఇప్పటికీ అదే చెబుతున్నారు. అయితే జగన్ విజయవాడ వరదల విషయంలోనే  ముందుగానే విజయవాడకు వెళ్లి మోకాళ్ల లోతు నీళ్లలో బాధితుల్ని పరామర్శించి వచ్చారు. 


సీఎం క్షేత్ర స్థాయిలోకి  రాకపోతే ఉద్యోగులు బాగాపని చేస్తారా?


చంద్రబాబును పని రాక్షసుడిగా ఉద్యోగులు చెబుతారు. దానికి తగ్గట్లగానే ఆయన పనితీరు ఉంటుంది. ఆయన క్షేత్ర స్థాయిలోకి రాకపోతే ఉద్యోగులు పనిచేసే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. నిజానికి సీఎం అంటే ఓ పదవి కాదు. అది ఓ వ్యవస్థ. ఆ వ్యవస్థ నేరుగా ఏదైనా ప్రాంతంలో ఉందంటే.. మొత్తం అధికారులు మొత్తం అప్రమత్తమైపోతారు. చెప్పిన పనిని చకచకా చేసేయాలి. అందుకే.. ఏ సీఎం అయినా.. విపత్తు జరిగితే ఆ ప్రాంతానికి వెళ్తారు. ఏ రాష్ట్రంలో అయినా అంతే.  చంద్రబాబు ఫీల్డ్ లో ఉంటే అధికారులు ఇంకా ఎక్కువ టెన్షన్ పడతారు. ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసినా వెంటనే కనిపెడతారు. అందుకే చంద్రబాబు ఫీల్డ్ లో ఉండటం వల్లనే ఎక్కువ మేలు జరుగుతుందని అంచనా వేయవచ్చు. 


YS Jagan Donation: వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా?


విమర్శల్ని పట్టించుకోని చంద్రబాబు


చంద్రబాబుకు తాను ఏం చేస్తున్నానో స్పష్తత ఉంటుందని ఎవరో పబ్లిసిటీ కోసం పని చేస్తున్నాననే మాటల్ని ఆయన అసలు పరిగణనలోకి తీసుకోరని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తనపై ఉన్న బాధ్యతను నెరవేర్చేందుకు ఆయన శ్రమించే విధానం వేరుగా ఉంటుంది.. అది విమర్శలకు అతీతమైనదని  వారి భావన. కారణం ఏదైనా ఓ ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో ఉంటే.. అధికార యంత్రాంగం ఆయన చెప్పినట్లుగా చురుకుగా పని చేస్తుందని మాత్రం విజయవాడ వరదలు నిరూపించాయని అనుకోవచ్చు.